Amta sesinatti ninne amdumu gaaga

అంత సేసినట్టి నిన్నే అందుము గాక
Language

(॥పల్లవి॥)
అంత సేసినట్టి నిన్నే అందుము గాక
యెంతకెంత వలపులు యింకా రేఁచేమా

(॥అంత॥)
వెన్నెల బయటనుండి వేసవి యెండలనేటి
కన్నెకు నేమని చెప్పఁగలము నేము
సన్నపుగాలిఁ జూచి జాజరకాఁడనఁగాను
విన్నవించేమా నేము వెలఁదికిని

(॥అంత॥)
ముడిచే పువ్వులు చూచి ముంచి మరునమ్ములనే
పడఁతి నేమని మట్టుపరచేము
నొడిగే కోవిలఁ జూచి పిడుగుల పక్షియంటే
తడవి యేమి చెప్పేము తరుణితోను

(॥అంత॥)
మలసే తుమ్మిదఁ జూచి మాసటీఁడని భ్రమసే
పొలితికి నేమని బుద్ది చెప్పేము
అలరి శ్రీ వేంకటేశ అంతలో నీపెఁగూడితి
తెలిసె నిందు వంకనే దేవర చిత్తము

(||pallavi||)
aṁta sesinaṭṭi ninne aṁdumu gāga
yĕṁtagĕṁta valabulu yiṁkā rem̐semā

(||aṁta||)
vĕnnĕla bayaḍanuṁḍi vesavi yĕṁḍalaneḍi
kannĕgu nemani sĕppam̐galamu nemu
sannabugālim̐ jūsi jājaragām̐ḍanam̐gānu
vinnaviṁchemā nemu vĕlam̐digini

(||aṁta||)
muḍise puvvulu sūsi muṁchi marunammulane
paḍam̐ti nemani maṭṭubarasemu
nŏḍige kovilam̐ jūsi piḍugula pakṣhiyaṁṭe
taḍavi yemi sĕppemu taruṇidonu

(||aṁta||)
malase tummidam̐ jūsi māsaḍīm̐ḍani bhramase
pŏlidigi nemani buddi sĕppemu
alari śhrī veṁkaḍeśha aṁtalo nībĕm̐gūḍidi
tĕlisĕ niṁdu vaṁkane devara sittamu