Amta sakkanivaamdavu annidaa jaanavu neevu

అంత చక్కనివాఁడవు అన్నిటా జాణవు నీవు
Language

(॥పల్లవి॥)
అంత చక్కనివాఁడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పంగీ సారెకు నా మనసు

(॥అంత॥)
పొలసి నిన్నొకమారు పూఁచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీరూపు దలఁచుకొంటే
వులివచ్చి చెమటల నోలలాడకుందురా

(॥అంత॥)
సముకాన నీతోను సంగాతాను సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోఁక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరుగక వుండుదురా

(॥అంత॥)
యాడుజోడై నిన్నుఁ గూడి యెడవాయ కుండితే
వేడుకఁ జొక్కకుందురా వెలఁదులు
యాడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యేడవారూ నీపొందుల కేఁకరకవుందురా

(||pallavi||)
aṁta sakkanivām̐ḍavu anniḍā jāṇavu nīvu
saṁtosāna nuppaṁgī sārĕgu nā manasu

(||aṁta||)
pŏlasi ninnŏgamāru pūm̐si tappaga sūside
valavaga vuṁḍudurā vanidalu
niluvuna nĕppuḍainā nīrūbu dalam̐sugŏṁṭe
vulivachchi sĕmaḍala nolalāḍaguṁdurā

(||aṁta||)
samugāna nīdonu saṁgādānu seside
tamagiṁchaguṁḍudurā taruṇulu
jamaḽi menulu som̐ka sarasamu lāḍidenu
mamadala ninnu niṭṭĕ marugaga vuṁḍudurā

(||aṁta||)
yāḍujoḍai ninnum̐ gūḍi yĕḍavāya kuṁḍide
veḍugam̐ jŏkkaguṁdurā vĕlam̐dulu
yāḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yeḍavārū nībŏṁdula kem̐karagavuṁdurā