అంత నేరుపరి మా యంగన నీతో నేఁడు
(॥పల్లవి॥)
అంత నేరుపరి మా యంగన నీతో నేఁడు
యింత సేసి దిష్టముగా నిటు చూపవలెఁ బో
(॥అంత॥)
పలికినంతనే పోదు పాయపు బీరాలు నిన్నుఁ
గలసి కాఁగిటఁగూడి ఘాత చూపక
చలపట్టి నంతఁ బోదు సారపు నేర్పులు చల్లి
వలపించి వలచి భావము చూపక
(॥అంత॥)
చెంతఁ జూచినంతఁ బోదు చెనకి మర్మాలు కొచ్చి
పంతములు నెరపుచు పైకొనక
రంతు సేసినంతఁ బోదు రాసి చన్నులు నురము
వింతలుగ మెరయుచు వీడుజోడైయుండక
(॥అంత॥)
దగ్గరినంతనే పోదు తలఁపుఁదలఁపుఁ గూడ
నిగ్గుదేర రతిసేసి నీటుచూపక
అగ్గమె శ్రీ వేంకటేశ అతివ నీవుఁగూడితి
యెగ్గులెల్లాఁ దీర నిట్టె యియ్యకొనక
(||pallavi||)
aṁta nerubari mā yaṁgana nīdo nem̐ḍu
yiṁta sesi diṣhṭamugā niḍu sūbavalĕm̐ bo
(||aṁta||)
paliginaṁtane podu pāyabu bīrālu ninnum̐
galasi kām̐giḍam̐gūḍi ghāda sūbaga
salabaṭṭi naṁtam̐ bodu sārabu nerbulu salli
valabiṁchi valasi bhāvamu sūbaga
(||aṁta||)
sĕṁtam̐ jūsinaṁtam̐ bodu sĕnagi marmālu kŏchchi
paṁtamulu nĕrabusu paigŏnaga
raṁtu sesinaṁtam̐ bodu rāsi sannulu nuramu
viṁtaluga mĕrayusu vīḍujoḍaiyuṁḍaga
(||aṁta||)
daggarinaṁtane podu talam̐pum̐dalam̐pum̐ gūḍa
niggudera radisesi nīḍusūbaga
aggamĕ śhrī veṁkaḍeśha adiva nīvum̐gūḍidi
yĕggulĕllām̐ dīra niṭṭĕ yiyyagŏnaga