అంత నీవు పంతములు ఆడుకోకు నాయెదుట
(॥పల్లవి॥)
అంత నీవు పంతములు ఆడుకోకు నాయెదుట
సంత వేదాల నీ మోవి చప్పరించివేతుఁ బో
(॥అంత॥)
మనసు చూచితిఁగాక మంతనాన నీచెఱఁగు
తనివోక నేఁ బట్టితే దాఁటిపోయేవా
మును రామావతారమున మునులలో నీవుండిన
వెనకటివ్రతమెల్లా విడిపింతుఁబో
(॥అంత॥)
వచ్చేవంటా నుంటిఁగాక వడి నీపైఁ జేయి వేసి
కచ్చు పెట్టి చెనకితేఁ గాదనేవా
పచ్చిగాఁ గృష్ణుఁడవై పలుయజ్ఞాలు సేసినఁ
మెచ్చుల ఆచారములు మీఁదుకిందు సేతుఁబో
(॥అంత॥)
యిప్పుడే కూడితిఁగాక యించుకవడి యుండితేఁ
నప్పటి నే దగ్గరితే నాసమానేవా
నెప్పున శ్రీవేంకటేశ నీవు యోగీంద్రులలోన
కప్పినరతిజడ్డు కమ్మటి మానుతుఁబో
(||pallavi||)
aṁta nīvu paṁtamulu āḍugogu nāyĕduḍa
saṁta vedāla nī movi sappariṁchivedum̐ bo
(||aṁta||)
manasu sūsidim̐gāga maṁtanāna nīsĕṟam̐gu
tanivoga nem̐ baṭṭide dām̐ṭiboyevā
munu rāmāvadāramuna munulalo nīvuṁḍina
vĕnagaḍivradamĕllā viḍibiṁtum̐bo
(||aṁta||)
vachchevaṁṭā nuṁṭim̐gāga vaḍi nībaim̐ jeyi vesi
kachchu pĕṭṭi sĕnagidem̐ gādanevā
pachchigām̐ gṛṣhṇum̐ḍavai paluyajñālu sesinam̐
mĕchchula āsāramulu mīm̐dugiṁdu sedum̐bo
(||aṁta||)
yippuḍe kūḍidim̐gāga yiṁchugavaḍi yuṁḍidem̐
nappaḍi ne daggaride nāsamānevā
nĕppuna śhrīveṁkaḍeśha nīvu yogīṁdrulalona
kappinaradijaḍḍu kammaḍi mānudum̐bo