అంత నీకు వేడుకైతే నట్టే వెండ్లాడరాదా
(॥పల్లవి॥)
అంత నీకు వేడుకైతే నట్టే వెండ్లాడరాదా
ఇంతి సిగ్గులు రచ్చనేల వేసేవు
(॥అంత॥)
కాటుక కన్నుల నిన్నుఁ గాఁడఁ జూచెనంటాను
ఆఁటదానినేల నీవు అద్దలించేవు
గాఁటపుగుబ్బలు చూపీ గబ్బితనాన నంటాను
నీటున నీకెపైనేల నెపాలు వేసేవు
(॥అంత॥)
నిక్కి మోవినే మాటాడి నిన్ను నోరూరించెనంటా
గక్కన మానినినేల కాకు సేసేవు
చక్కఁదనములు చూపి చవులు వుట్టించెనంటా
చిక్కించుక గోరనేల చిమ్మవచ్చేవు
(॥అంత॥)
మలసి నీముతరను మనసు గరఁచీనంటా
కలికి నెంతేసి బిగ్గెఁ గాఁగిలించేవు
యెలమి శ్రీవేంకటేశ యేలితి వీవనితను
నలిరేఁగి యెంతవడి నవ్వులు నవ్వేవు
(||pallavi||)
aṁta nīgu veḍugaide naṭṭe vĕṁḍlāḍarādā
iṁti siggulu rachchanela vesevu
(||aṁta||)
kāḍuga kannula ninnum̐ gām̐ḍam̐ jūsĕnaṁṭānu
ām̐ṭadāninela nīvu addaliṁchevu
gām̐ṭabugubbalu sūbī gabbidanāna naṁṭānu
nīḍuna nīgĕbainela nĕbālu vesevu
(||aṁta||)
nikki movine māḍāḍi ninnu norūriṁchĕnaṁṭā
gakkana mānininela kāgu sesevu
sakkam̐danamulu sūbi savulu vuṭṭiṁchĕnaṁṭā
sikkiṁchuga goranela simmavachchevu
(||aṁta||)
malasi nīmudaranu manasu garam̐sīnaṁṭā
kaligi nĕṁtesi biggĕm̐ gām̐giliṁchevu
yĕlami śhrīveṁkaḍeśha yelidi vīvanidanu
nalirem̐gi yĕṁtavaḍi navvulu navvevu