అంత నీకు వేడుకైతే నటు సేస చల్లరాదా
(॥పల్లవి॥)
అంత నీకు వేడుకైతే నటు సేస చల్లరాదా
మంతనాన నున్నవారి మఱి కాఁకుసేతురా
(॥అంత॥)
మరుతంత్రానఁ జెలితో మరిగి యాతఁడుండఁగా
తెర యేల తీసేవే తెల్లమిగాను
నిరతి నిద్దరుఁ జొక్కె నిద్దురింపుచుండఁగాను
విరుల నేల వేసేవే వెక్కసానను
(॥అంత॥)
యేపున గొనాల గొంది నిద్దరు మేలమాడఁగ
దీప మేల తెచ్చేవే దిష్టము చూడ
పైపై నిద్దరు లోలో బాగాలు చేసుకోఁగా
యీ పొద్దేల తొంగి చూచే వెగసక్కేలకును
(॥అంత॥)
మంచముపై నిద్దరును మర్మములు చెప్పుకోఁగా
పొంచు లేల వినేవే చప్పుడు సేయకా
అంచుల శ్రీవేంకటేశుఁ డాకె నిన్ను గూడినాఁడు
మించి యేల నవ్వేవే మే లెల్లాఁ గలిగెను
(||pallavi||)
aṁta nīgu veḍugaide naḍu sesa sallarādā
maṁtanāna nunnavāri maṟi kām̐kusedurā
(||aṁta||)
marudaṁtrānam̐ jĕlido marigi yādam̐ḍuṁḍam̐gā
tĕra yela tīseve tĕllamigānu
niradi niddarum̐ jŏkkĕ nidduriṁpusuṁḍam̐gānu
virula nela veseve vĕkkasānanu
(||aṁta||)
yebuna gŏnāla gŏṁdi niddaru melamāḍam̐ga
dība mela tĕchcheve diṣhṭamu sūḍa
paibai niddaru lolo bāgālu sesugom̐gā
yī pŏddela tŏṁgi sūse vĕgasakkelagunu
(||aṁta||)
maṁchamubai niddarunu marmamulu sĕppugom̐gā
pŏṁchu lela vineve sappuḍu seyagā
aṁchula śhrīveṁkaḍeśhum̐ ḍāgĕ ninnu gūḍinām̐ḍu
miṁchi yela navveve me lĕllām̐ galigĕnu