అంత మనసునఁ గద్దు ఆపెకు నీమీఁది బత్తి
(॥పల్లవి॥)
అంత మనసునఁ గద్దు ఆపెకు నీమీఁది బత్తి
సంతోస మప్పటిఁ జేసీ చనవియ్యవయ్యా
(॥॥)
ఘనమైననీదుచక్కనిరూపు చూచిచూచి
తనివి దీర దెంతైనాఁ దరుణికిని
పనివడి నీవలెనే బంగారుపతిమఁ జేసి
వెనుకొ నాపెమోమున వేలఁగట్టవయ్యా
(॥॥)
సరసములాడి నీతో సారెకు నవ్వులు నవ్వీ
మరిగియున్నది నీ పై మచ్చికలెల్లా
సరుసఁగూచుండి నీవు చవులుగాఁ జెనకుచు
కెరలించి కెరలించి గిలిగించవయ్యా
(॥॥)
ముట్టి నీపాదము లురమున నిడుక వొత్తుచు
యిట్టె పాయదు శ్రీ వేంకటేశ నిన్నును
నెట్టన నన్నేలితివి నీవింకా సొమ్ములు సేసి
మెట్టి నీపాదుకలాపెమెడఁ గట్టవయ్యా
(||pallavi||)
aṁta manasunam̐ gaddu ābĕgu nīmīm̐di batti
saṁtosa mappaḍim̐ jesī sanaviyyavayyā
(||||)
ghanamainanīdusakkanirūbu sūsisūsi
tanivi dīra dĕṁtainām̐ daruṇigini
panivaḍi nīvalĕne baṁgārubadimam̐ jesi
vĕnugŏ nābĕmomuna velam̐gaṭṭavayyā
(||||)
sarasamulāḍi nīdo sārĕgu navvulu navvī
marigiyunnadi nī pai machchigalĕllā
sarusam̐gūsuṁḍi nīvu savulugām̐ jĕnagusu
kĕraliṁchi kĕraliṁchi giligiṁchavayyā
(||||)
muṭṭi nībādamu luramuna niḍuga vŏttusu
yiṭṭĕ pāyadu śhrī veṁkaḍeśha ninnunu
nĕṭṭana nannelidivi nīviṁkā sŏmmulu sesi
mĕṭṭi nībādugalābĕmĕḍam̐ gaṭṭavayyā