Amta mammum jenagagu mamdugemi

అంత మమ్ముఁ జెనకకు మందుకేమి
Language

(॥పల్లవి॥)
అంత మమ్ముఁ జెనకకు మందుకేమి
ఇంత నీతోఁ జెప్పనేల ఇప్పు డందుకేమి

(॥అంత॥)
వాములుగా బొంకనేర వట్టివంతా లాడనేర
ఆమాటే మఱవకు మందుకేమే
నీ మచ్చము లెంచ రాము నిన్నుఁ దడవఁగరాము
ఆముకొని మమ్ము నవ్వే వందుకేమి

(॥అంత॥)
తప్పులు వట్టఁగనేల తారుకాణించఁగనేల
అప్పుడే చెప్పేఁగాని అందుకేమి
రెప్పలెత్తి చూడవద్దు రేసులు పుట్టించవద్దు
చప్పఁ జేసేవు వలపు సారె నందుకేమి

(॥అంత॥)
కొంగువట్టి తియ్యలేదు కూరిమి గొసరలేదు
అంగవించి కాఁగిలించే వందుకేమి
రంగగు శ్రీవేంకటేశ రవ్వసేయ నిఁకనేల
యెంగిలి సేసితి మోవి యిఁక నందుకేమి

(||pallavi||)
aṁta mammum̐ jĕnagagu maṁdugemi
iṁta nīdom̐ jĕppanela ippu ḍaṁdugemi

(||aṁta||)
vāmulugā bŏṁkanera vaṭṭivaṁtā lāḍanera
āmāḍe maṟavagu maṁdugeme
nī machchamu lĕṁcha rāmu ninnum̐ daḍavam̐garāmu
āmugŏni mammu navve vaṁdugemi

(||aṁta||)
tappulu vaṭṭam̐ganela tārugāṇiṁcham̐ganela
appuḍe sĕppem̐gāni aṁdugemi
rĕppalĕtti sūḍavaddu resulu puṭṭiṁchavaddu
sappam̐ jesevu valabu sārĕ naṁdugemi

(||aṁta||)
kŏṁguvaṭṭi tiyyaledu kūrimi gŏsaraledu
aṁgaviṁchi kām̐giliṁche vaṁdugemi
raṁgagu śhrīveṁkaḍeśha ravvaseya nim̐kanela
yĕṁgili sesidi movi yim̐ka naṁdugemi