Amta mammu jolimbetti kavule neevu | nee

అంత మమ్ము జోలిఁబెట్టి కవులే నీవు । నీ
Language

(॥పల్లవి॥)
అంత మమ్ము జోలిఁబెట్టి కవులే నీవు । నీ-
యంతరంగమే యెఱుఁగు నంటకురా నీవు

(॥అంత॥)
చెక్కులేల చెమరిఁచెఁ జెలితో నవ్వకుండితే
నక్కట బాసలు సేసే వప్పటి నీవు
ముక్కునూర్పులేల రేఁగె ముగుదవై వుండితేను
చక్కటి చెప్పకు నాతో సారాసారె నీవు

(॥అంత॥)
అంగమేల పులకించె నాకెయింటి కేఁగకుంటే
యింగితాలు మొరఁగేవు యేరా నీవు
సంగతిఁ గొప్పేల వీడె సతిచేయి దాఁకకుంటే
జంగిలివేసాలు నాతో చవిగాదునీవు

(॥అంత॥)
లత్తు కేలంటె నొసల లలనకు మొక్కకుంటే
వుత్తరా లియ్యవచ్చేవు వొద్దురా నీవు
కొత్తలై శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు
మత్తిలి యితరములు మానరా నీవు

(||pallavi||)
aṁta mammu jolim̐bĕṭṭi kavule nīvu | nī-
yaṁtaraṁgame yĕṟum̐gu naṁṭagurā nīvu

(||aṁta||)
sĕkkulela sĕmarim̐sĕm̐ jĕlido navvaguṁḍide
nakkaḍa bāsalu sese vappaḍi nīvu
mukkunūrbulela rem̐gĕ mugudavai vuṁḍidenu
sakkaḍi sĕppagu nādo sārāsārĕ nīvu

(||aṁta||)
aṁgamela pulagiṁchĕ nāgĕyiṁṭi kem̐gaguṁṭe
yiṁgidālu mŏram̐gevu yerā nīvu
saṁgadim̐ gŏppela vīḍĕ sadiseyi dām̐kaguṁṭe
jaṁgilivesālu nādo savigādunīvu

(||aṁta||)
lattu kelaṁṭĕ nŏsala lalanagu mŏkkaguṁṭe
vuttarā liyyavachchevu vŏddurā nīvu
kŏttalai śhrīveṁkaḍeśha kūḍidivi nannu nem̐ḍu
mattili yidaramulu mānarā nīvu