Amta kobidene mammu natte nagumee

అంత కోపితేనే మమ్ము నట్టె నగుమీ
Language

(॥పల్లవి॥)
అంత కోపితేనే మమ్ము నట్టె నగుమీ
చెంత నీవు చెనకిన చెనకక మానము

(॥అంత॥)
వొక్కటంటే రెండనక వుండుదురా యెవ్వరైనా
మక్కవ ముందర చూచి మాటాడరా
యెక్కువైనదొరవైతే యేలుదుగాని భూమెల్ల
చక్కనిమావద్దనుంటే జరయకమానము

(॥అంత॥)
మెఱిచిన నుఱుమక మిన్నైన నుండదట
గుఱి నీచేఁతలు చూచి కోపము రాదా
నెఱజాణవైతే నీకునీవే వుండేవుగాని
నెఱయ సరికిబేశౌ నిలువకమానము

(॥అంత॥)
ముయికి ముయి వెట్టేది మున్నిటివారితగవు
నియతి నీవు మెచ్చిన నేను మెచ్చితి
ప్రియుఁడ శ్రీవేంకటేశ పెంపునఁ గూడితి నన్ను
నయమున గుఱుతులు నాటించకమానము

(||pallavi||)
aṁta kobidene mammu naṭṭĕ nagumī
sĕṁta nīvu sĕnagina sĕnagaka mānamu

(||aṁta||)
vŏkkaḍaṁṭe rĕṁḍanaga vuṁḍudurā yĕvvarainā
makkava muṁdara sūsi māḍāḍarā
yĕkkuvainadŏravaide yeludugāni bhūmĕlla
sakkanimāvaddanuṁṭe jarayagamānamu

(||aṁta||)
mĕṟisina nuṟumaga minnaina nuṁḍadaḍa
guṟi nīsem̐talu sūsi kobamu rādā
nĕṟajāṇavaide nīgunīve vuṁḍevugāni
nĕṟaya sarigibeśhau niluvagamānamu

(||aṁta||)
muyigi muyi vĕṭṭedi munniḍivāridagavu
niyadi nīvu mĕchchina nenu mĕchchidi
priyum̐ḍa śhrīveṁkaḍeśha pĕṁpunam̐ gūḍidi nannu
nayamuna guṟudulu nāḍiṁchagamānamu