Ampavayyaa nemboye natteni vaavaada

అంపవయ్యా నేఁబోయే నట్టేని వావాత
Language

(॥పల్లవి॥)
అంపవయ్యా నేఁబోయే నట్టేని వావాత
తెంపున నాయంతనైతే తెగరాదు పనులు

(॥॥)
కోపము గాదుగదా గొబ్బున నే వచ్చినది
ఆపెతో నీ వేకతము లాడేవేళ
చేపట్టి నేఁదొలఁగితే సిగ్గువుచ్చినట్టయ్యీ
యీపొద్దు నీవద్దనుంటే నేమౌనో నీయాస

(॥॥)
యెగ్గు లెంచవుగదా ఇట్టె ముసుఁగు దీసితే
వొగ్గి ఆకెతోడిరతి నున్నవేళను
కగ్గి కమ్మరఁ గప్పితే కల్ల మోపినట్టయ్యీ
నిగ్గుల నే నూరకున్న నీ కెంతవెఱపో

(॥॥)
నేరమి గాదుగదా నే నిన్నుఁ గాఁగిలించితి
నేరపున నాకెఁ గూడి నిద్రించేవేళ
యేరా శ్రీవేంకటేశ యెఱగఁనట్టె నన్ను
యీరీతిఁ గూడితివి నీ వికడి మోమగుచు

(||pallavi||)
aṁpavayyā nem̐boye naṭṭeni vāvāda
tĕṁpuna nāyaṁtanaide tĕgarādu panulu

(||||)
kobamu gādugadā gŏbbuna ne vachchinadi
ābĕdo nī vegadamu lāḍeveḽa
sebaṭṭi nem̐dŏlam̐gide sigguvuchchinaṭṭayyī
yībŏddu nīvaddanuṁṭe nemauno nīyāsa

(||||)
yĕggu lĕṁchavugadā iṭṭĕ musum̐gu dīside
vŏggi āgĕdoḍiradi nunnaveḽanu
kaggi kammaram̐ gappide kalla mobinaṭṭayyī
niggula ne nūragunna nī kĕṁtavĕṟabo

(||||)
nerami gādugadā ne ninnum̐ gām̐giliṁchidi
nerabuna nāgĕm̐ gūḍi nidriṁcheveḽa
yerā śhrīveṁkaḍeśha yĕṟagam̐naṭṭĕ nannu
yīrīdim̐ gūḍidivi nī vigaḍi momagusu