అంపరాదా గురుతులు అందాఁకాను
(॥పల్లవి॥)
అంపరాదా గురుతులు అందాఁకాను
యింపులే చల్లీ నిన్ను యెనయుదాఁకాను
(॥అంప॥)
అంగన నీపాదుకలు అంపు మనె నిన్నాడకు
చెంగట నీవు విచ్చేసినదాఁకాను
వుంగరమే పూజించుక వుండేననే నీమారు
కంగుదీర నీరూపము కన్నదాఁకాను
(॥అంప॥)
నీపదాలు వినిపించేనేలఁతల నంపు మనె
ఆపొద్దు నీతో మాటలాడుదాఁకాను
యేపున విం దాయితము యిట్టే సేసు కుండే ననె
చేపట్టి నీవు దన్ను మెచ్చినదాఁకాను
(॥అంప॥)
తలఁపు లోఁ గలిగి నీతమ్ములమె యంపుమనె
నిలిచి నీరతుల మన్నించుదాఁకాను
అలరి శ్రీ వేంకటేశ ఆపె నిట్టె కూడితివి
కలసి తా నుండే ననె కమ్మటి నిందాఁకాను
(||pallavi||)
aṁparādā gurudulu aṁdām̐kānu
yiṁpule sallī ninnu yĕnayudām̐kānu
(||aṁpa||)
aṁgana nībādugalu aṁpu manĕ ninnāḍagu
sĕṁgaḍa nīvu vichchesinadām̐kānu
vuṁgarame pūjiṁchuga vuṁḍenane nīmāru
kaṁgudīra nīrūbamu kannadām̐kānu
(||aṁpa||)
nībadālu vinibiṁchenelam̐tala naṁpu manĕ
ābŏddu nīdo māḍalāḍudām̐kānu
yebuna viṁ dāyidamu yiṭṭe sesu kuṁḍe nanĕ
sebaṭṭi nīvu dannu mĕchchinadām̐kānu
(||aṁpa||)
talam̐pu lom̐ galigi nīdammulamĕ yaṁpumanĕ
nilisi nīradula manniṁchudām̐kānu
alari śhrī veṁkaḍeśha ābĕ niṭṭĕ kūḍidivi
kalasi tā nuṁḍe nanĕ kammaḍi niṁdām̐kānu