Ampamgala vellaa nampe nadani raagagum jeli

అంపఁగల వెల్లా నంపె నతని రాకకుఁ జెలి
Language

(॥పల్లవి॥)
అంపఁగల వెల్లా నంపె నతని రాకకుఁ జెలి
చెంపజాఱుఁ దురుముల చిఱునవ్వు లంపె

(॥అంప॥)
కాంత దనరమణునికడకుఁ జెలియ నంపె
వింతకనుచూపులు వెంటనే యంపె
మంతనాన నెదురుగా మనోరథము లంపె
పంతపుఁ గన్నీట యర్ఘ్యపాద్యము లంపె

(॥అంప॥)
పిలిచి తెమ్మని పతిపేరిట లేఖ లంప
వెలిఁ దనయడుగులు వెంటనే యంపె
నెలవయి వేగిరాన నిట్టూర్పుగాలి నంపె
అలర నాందోళపు టందలము లంపె

(॥అంప॥)
కౌఁగిటికిఁ గరములఁ గైకోలు వీడె మంపె
వీఁగిన గోరిచంద్రుల వెంటనే యంపె
రాఁగి శ్రీవేంకటపతి రతిఁ గూడి యీ చెలి
లోఁగిన సిగ్గుల నెల్లా లోలోనే యంపె

(||pallavi||)
aṁpam̐gala vĕllā naṁpĕ nadani rāgagum̐ jĕli
sĕṁpajāṟum̐ durumula siṟunavvu laṁpĕ

(||aṁpa||)
kāṁta danaramaṇunigaḍagum̐ jĕliya naṁpĕ
viṁtaganusūbulu vĕṁṭane yaṁpĕ
maṁtanāna nĕdurugā manorathamu laṁpĕ
paṁtabum̐ gannīḍa yarghyabādyamu laṁpĕ

(||aṁpa||)
pilisi tĕmmani padiberiḍa lekha laṁpa
vĕlim̐ danayaḍugulu vĕṁṭane yaṁpĕ
nĕlavayi vegirāna niṭṭūrbugāli naṁpĕ
alara nāṁdoḽabu ṭaṁdalamu laṁpĕ

(||aṁpa||)
kaum̐giḍigim̐ garamulam̐ gaigolu vīḍĕ maṁpĕ
vīm̐gina gorisaṁdrula vĕṁṭane yaṁpĕ
rām̐gi śhrīveṁkaḍabadi radim̐ gūḍi yī sĕli
lom̐gina siggula nĕllā lolone yaṁpĕ