అంపఁగానే వచ్చితిమి ఆపె నీవద్దికి మమ్ము
(॥పల్లవి॥)
అంపఁగానే వచ్చితిమి ఆపె నీవద్దికి మమ్ము
సంపదతో మరవక చనవులీవయ్యా
(॥॥)
వొలిసీనొల్లని వలపొడిఁబెట్టి వేసరించ
చలమా మాకేమి సారెసారెకు
చెలిపై నీవే వచ్చి సేసచల్లి వచ్చితట
తలఁచుక నీవే ఆకె దండకు రావయ్యా
(॥॥)
సంతవేడుకలు నీకు చవి చూచి పిలువఁగ
పంతమా మాకేమి పైపై నిట్టే
కాంతకు నీవపుడే వుంగరము వెట్టితివట
మంతనానఁ దెలుసుక మన్నించవయ్యా
(॥॥)
దొమ్మికూటముల నిన్ను దొరలించి అలయించ
యెమ్మెలా మాకేమి యింతటిలోనే
నెమ్మది శ్రీవేంకటేశ నెలఁత నేలితివట
సమ్మతాయ నిటులానే సతముగావయ్యా
(||pallavi||)
aṁpam̐gāne vachchidimi ābĕ nīvaddigi mammu
saṁpadado maravaga sanavulīvayyā
(||||)
vŏlisīnŏllani valabŏḍim̐bĕṭṭi vesariṁcha
salamā māgemi sārĕsārĕgu
sĕlibai nīve vachchi sesasalli vachchidaḍa
talam̐suga nīve āgĕ daṁḍagu rāvayyā
(||||)
saṁtaveḍugalu nīgu savi sūsi piluvam̐ga
paṁtamā māgemi paibai niṭṭe
kāṁtagu nīvabuḍe vuṁgaramu vĕṭṭidivaḍa
maṁtanānam̐ dĕlusuga manniṁchavayyā
(||||)
dŏmmigūḍamula ninnu dŏraliṁchi alayiṁcha
yĕmmĕlā māgemi yiṁtaḍilone
nĕmmadi śhrīveṁkaḍeśha nĕlam̐ta nelidivaḍa
sammadāya niḍulāne sadamugāvayyā