Ammedi dogadiyu nasimaloni dogadi

అమ్మేటి దొకటియు నసిమలోని దొకటి
Language

(॥పల్లవి॥)
అమ్మేటి దొకటియు నసిమలోని దొకటి
యిమ్ముల నీయందే కంటి మిదివో దిష్టాంతము

(॥అమ్మే॥)
మతిలో నొకటి వెట్టి మాట వేరొక టాడేటిఁ
మతకారి నిన్ను దూర మావసములా
తతి సగము సింహము తగునరుఁడౌ సగఁ
మితవుగఁ గైకొంటి విదివో దిష్టాంతము

(॥అమ్మే॥)
సెలవులనే నవ్వులు సేసేసేఁతలు వేరె
బలువుఁడ నీతోడి పంతము గద్దా
యిల దేవకికిఁ బుట్టి యెశోదకొడుక వైతిఁ
వెలమి నీసుద్దులకు నిదివో దిష్టాంతము

(॥అమ్మే॥)
నేరువు నీ కొకచోట నిజము నేఁడొకచోట
కోరి శ్రీవేంకటేశుఁడ కూడితి నన్ను
గోరపాతాళాన నుండి కొండ మీఁద నిక్కితివి
యీరీతి నీగుణముల కిదివో దిష్టాంతము

(||pallavi||)
ammeḍi dŏgaḍiyu nasimaloni dŏgaḍi
yimmula nīyaṁde kaṁṭi midivo diṣhṭāṁtamu

(||amme||)
madilo nŏgaḍi vĕṭṭi māḍa verŏga ṭāḍeḍim̐
madagāri ninnu dūra māvasamulā
tadi sagamu siṁhamu tagunarum̐ḍau sagam̐
midavugam̐ gaigŏṁṭi vidivo diṣhṭāṁtamu

(||amme||)
sĕlavulane navvulu sesesem̐talu verĕ
baluvum̐ḍa nīdoḍi paṁtamu gaddā
yila devagigim̐ buṭṭi yĕśhodagŏḍuga vaidim̐
vĕlami nīsuddulagu nidivo diṣhṭāṁtamu

(||amme||)
neruvu nī kŏgasoḍa nijamu nem̐ḍŏgasoḍa
kori śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidi nannu
gorabādāḽāna nuṁḍi kŏṁḍa mīm̐da nikkidivi
yīrīdi nīguṇamula kidivo diṣhṭāṁtamu