అమ్మే దొకటియును నసిమిలో దొకటియు
(॥పల్లవి॥)
అమ్మే దొకటియును నసిమిలో దొకటియు
నమ్మిన నీ మోహ మింతా కానరాదా నాకును
(॥అమ్మే॥)
కొప్పు జారె నిఁక నేలే కోపము లంటేఁ
దప్పక చూచే వదేమే తగదా మాట
చెప్పక చేప్పీ నదే సిగ్గు నెగ్గును నీ
కప్పీన మోహ మిందే కానరాదా నాకును
(॥అమ్మే॥)
చెమరించె నిఁక నేలే చిమ్ముఁ గాఁకలూ అంటే
తమకించి పలికేవు తగదా మాట
అమరీనమరదు నీ యావభావాలు
గమి నీ వలపు లిందే కానరాదా నాకును
(॥అమ్మే॥)
పులకించె నిఁక నేలే బులుపులు
తల వంచే వది యేమే తగదా మాట
యెలమి శ్రీవేంకటేశు నిటు గూడితి
కలికి నీ కూరి మిందే కానరాదా నాకును
(||pallavi||)
amme dŏgaḍiyunu nasimilo dŏgaḍiyu
nammina nī moha miṁtā kānarādā nāgunu
(||amme||)
kŏppu jārĕ nim̐ka nele kobamu laṁṭem̐
dappaga sūse vademe tagadā māḍa
sĕppaga seppī nade siggu nĕggunu nī
kappīna moha miṁde kānarādā nāgunu
(||amme||)
sĕmariṁchĕ nim̐ka nele simmum̐ gām̐kalū aṁṭe
tamagiṁchi paligevu tagadā māḍa
amarīnamaradu nī yāvabhāvālu
gami nī valabu liṁde kānarādā nāgunu
(||amme||)
pulagiṁchĕ nim̐ka nele bulubulu
tala vaṁche vadi yeme tagadā māḍa
yĕlami śhrīveṁkaḍeśhu niḍu gūḍidi
kaligi nī kūri miṁde kānarādā nāgunu