Ammaro yemtavuddam(ddam)deem daavibhumdu

అమ్మరో యెంతవుద్దఁ(ద్దం)డీఁ డావిభుఁడు
Language

(॥పల్లవి॥)
అమ్మరో యెంతవుద్దఁ(ద్దం)డీఁ డావిభుఁడు
బొమ్మల జంకించి యెంతపొమ్మనినాఁ బోఁడు

(॥అమ్మ॥)
గుట్టున నే నుండఁగాను కొచ్చికొచ్చి చూచీని
వొట్టువెట్టినా మానఁ డొయమ్మ వీఁడు
ఱట్టుసేసి పిసికీని ఱాలవంటిచన్నులు
దిట్టయై చేతులువట్టి తీసినాఁ బోనియ్యఁడు

(॥అమ్మ॥)
మానాపతినైననాతో మాటలు సారె నాడీ
ఆనవెట్టినా విడువఁ డక్కరో వీఁడు
ఆనుక యిందరిలో నాఆయము లంటఁగవచ్చీ
యే నెంతపెనఁగినాను ఇంచుకా జడియఁడు

(॥అమ్మ॥)
తలవంచుకొన్ననాతో తగిలితగిలి నవ్వీ
తలుపు మూసిన వచ్చి తడవీ వీఁడు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
బలిమి నెంతగూడినాఁ బంతాన నలయఁడు

(||pallavi||)
ammaro yĕṁtavuddam̐(ddaṁ)ḍīm̐ ḍāvibhum̐ḍu
bŏmmala jaṁkiṁchi yĕṁtabŏmmaninām̐ bom̐ḍu

(||amma||)
guṭṭuna ne nuṁḍam̐gānu kŏchchigŏchchi sūsīni
vŏṭṭuvĕṭṭinā mānam̐ ḍŏyamma vīm̐ḍu
ṟaṭṭusesi pisigīni ṟālavaṁṭisannulu
diṭṭayai seduluvaṭṭi tīsinām̐ boniyyam̐ḍu

(||amma||)
mānābadinainanādo māḍalu sārĕ nāḍī
ānavĕṭṭinā viḍuvam̐ ḍakkaro vīm̐ḍu
ānuga yiṁdarilo nāāyamu laṁṭam̐gavachchī
ye nĕṁtabĕnam̐ginānu iṁchugā jaḍiyam̐ḍu

(||amma||)
talavaṁchugŏnnanādo tagilidagili navvī
talubu mūsina vachchi taḍavī vīm̐ḍu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
balimi nĕṁtagūḍinām̐ baṁtāna nalayam̐ḍu