అమ్మరొ యెంతగడుసరి వదేమె నీవు వల
(॥పల్లవి॥)
అమ్మరొ యెంతగడుసరి వదేమె నీవు వల-
పమ్మక తొల్లె కొనేవు అదేమె నీవూ
(॥అమ్మ॥)
మలసి విభుఁడు నీతో మాటలాడకతొల్లె
అలిగి యెగ్గులువట్టే వదేమె నీవూ
కలసి యాతఁడు నిన్నుఁ గరఁగించకతొల్లె
అలసి వుస్సురనేవు అదేమె నీవూ
(॥అమ్మ॥)
చక్కఁగాను నీపతి సరసమాడకతొల్లె
అక్కడజీరె ననేవు అదేమె నీవు
తక్కక యాతఁడు నీకు తమ్ముల మిడకతొల్లె
అక్కట కారమనేవు అదేమె నీవూ
(॥అమ్మ॥)
యెనసె శ్రీవెంకటేశుఁ డిప్పుడు యింతకతొల్లె
అనుకొనే వాలనంటా నదేమె నీవూ
చెనకితి వితఁడు పైఁ జేయి చాఁచకతొల్లె
అనలుఁగొనలకెక్కే వదేమె నీవూ
(||pallavi||)
ammarŏ yĕṁtagaḍusari vademĕ nīvu vala-
pammaga tŏllĕ kŏnevu ademĕ nīvū
(||amma||)
malasi vibhum̐ḍu nīdo māḍalāḍagadŏllĕ
aligi yĕgguluvaṭṭe vademĕ nīvū
kalasi yādam̐ḍu ninnum̐ garam̐giṁchagadŏllĕ
alasi vussuranevu ademĕ nīvū
(||amma||)
sakkam̐gānu nībadi sarasamāḍagadŏllĕ
akkaḍajīrĕ nanevu ademĕ nīvu
takkaga yādam̐ḍu nīgu tammula miḍagadŏllĕ
akkaḍa kāramanevu ademĕ nīvū
(||amma||)
yĕnasĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍippuḍu yiṁtagadŏllĕ
anugŏne vālanaṁṭā nademĕ nīvū
sĕnagidi vidam̐ḍu paim̐ jeyi sām̐sagadŏllĕ
analum̐gŏnalagĕkke vademĕ nīvū