Ammamammo telisimdile guttu telisa

అమ్మమమ్మో తెలిసిందిలే గుట్టు తెలిస
Year
Language

పల్లవి:

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని

అమ్మమమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే

చరణం 1:

కులికే వయసే పులకించి పోగా
పోంగు ఆగుతుందా... ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

కులికే వయసు పులకించి పోగా
పొంగు ఆగుతుందా.. ఎదలో కదిలే పొంగు ఆగుతుందా

పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని
అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే

చరణం 2:

వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా.. విరిసే మురిసే.. తలపు దాగుతుందా

వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా.. విరిసే మురిసే.. తలపు దాగుతుందా

తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
దాచినా దోర వలపు దాగుతుందా

అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని
అమ్మమమ్మో తెలిసిందిలే.. గుట్టు తెలిసిందిలే

pallavi:

ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile
nī rūbulalona.. nī sūbulona
e rāsagaḽalo mĕrisenani

ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile
e kŏṁṭĕ maruḍo.. gaṁdharva varuḍo
nā kaḽḽalona navvenani

ammamammo tĕlisiṁdile guṭṭu tĕlisiṁdile

saraṇaṁ 1:

kulige vayase pulagiṁchi pogā
poṁgu āguduṁdā... ĕdalo kadile pŏṁgu āguduṁdā

kulige vayasu pulagiṁchi pogā
pŏṁgu āguduṁdā.. ĕdalo kadile pŏṁgu āguduṁdā

puvvalle māriboyi.. muddullo teliboyi
puvvalle māriboyi.. muddullo teliboyi
kavviste kannĕ manasu āguduṁdā

ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile
nī rūbulalona.. nī sūbulona
e rāsagaḽalo mĕrisenani
ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile

saraṇaṁ 2:

valase jābili ilabaina rāga
kaluva dāguduṁdā.. virise murise.. talabu dāguduṁdā

valase jābili ilabaina rāga
kaluva dāguduṁdā.. virise murise.. talabu dāguduṁdā

tīgalle allugŏṁṭe..āha..
guṁḍĕllo jallumaṁṭe..oho..
tīgalle allugŏṁṭe..āha..
guṁḍĕllo jallumaṁṭe..oho..
dāsinā dora valabu dāguduṁdā

ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile
e kŏṁṭĕ maruḍo.. gaṁdharva varuḍo
nā kaḽḽalona navvenani
ammamammo tĕlisiṁdile.. guṭṭu tĕlisiṁdile