Ammalaala akkalaala avigo vimta suddulu

అమ్మలాల అక్కలాల అవిగో వింత సుద్దులు
Language

(॥పల్లవి॥)
అమ్మలాల అక్కలాల అవిగో వింత సుద్దులు
నెమ్మది వింటిరటరే నిచ్చ నిచ్చ కొత్తలు

(॥అమ్మ॥)
అల్ల వాఁడే శ్రావణ బహుళష్టమిని నడురేయి
చల్లఁగా రోహిణివేళ జనించినాఁడు
వెల్లవిరి దేవకిదేవికి వసుదేవునికి
మొల్లమిఁ గొడుకైనాఁడు ముద్దులకృష్ణుఁడు

(॥అమ్మ॥)
పొంచి యశోదానందగోపులకు సుతునివలెఁ
బెంచఁగా రేపల్లెలోనఁ బెరిగీ వీఁడె
ముంచి యీతనికంటేనె ముందే బలభద్రుఁడు
అంచెల రోహిణీదేవి కవతరించినాఁడు

(॥అమ్మ॥)
మొదల దేవకతలకు మూలభూతి యితఁడట
యెదుట లోకములెల్లా నేలీనటా
అదిగో శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగాఁ దాను
చెదకు కాఁపురాలు సేసీనటా

(||pallavi||)
ammalāla akkalāla avigo viṁta suddulu
nĕmmadi viṁṭiraḍare nichcha nichcha kŏttalu

(||amma||)
alla vām̐ḍe śhrāvaṇa bahuḽaṣhṭamini naḍureyi
sallam̐gā rohiṇiveḽa janiṁchinām̐ḍu
vĕllaviri devagidevigi vasudevunigi
mŏllamim̐ gŏḍugainām̐ḍu muddulakṛṣhṇum̐ḍu

(||amma||)
pŏṁchi yaśhodānaṁdagobulagu sudunivalĕm̐
bĕṁcham̐gā reballĕlonam̐ bĕrigī vīm̐ḍĕ
muṁchi yīdanigaṁṭenĕ muṁde balabhadrum̐ḍu
aṁchĕla rohiṇīdevi kavadariṁchinām̐ḍu

(||amma||)
mŏdala devagadalagu mūlabhūdi yidam̐ḍaḍa
yĕduḍa logamulĕllā nelīnaḍā
adigo śhrīveṁkaḍeśhum̐ḍai yalamelmaṁgām̐ dānu
sĕdagu kām̐purālu sesīnaḍā