(॥పల్లవి॥)
అమ్మలాల అక్కలాల అతివలాల
దిమ్మరి గదవే వీఁడు తిల్ల గోవిందరాజు
(॥అమ్మ॥)
యీవలనావల సతులిరుమేల నుండఁగాను
చేవమీర నవ్వు నవ్వ సిగ్గువడఁడు
పూవుల నొకతె వేసీ పొం చొకతెతో మాటాడి
దేవర గదవే వీఁడు తిల్ల గోవిందరాజు
(॥అమ్మ॥)
పేరడిగా నందరును పెనఁగుచు నుండఁగాను
చేరి కొంగులు వట్టీని సిగ్గువడఁడు
మారుకొనొకతెఁ జూచి మర్మము లొకతె నంటీ
తేరినవాఁడు గదవే తిల్లగోవిందరాజు
(॥అమ్మ॥)
యిట్టె పాదాలొత్తఁగాను ఇందిరను భూసతిని
చిట్టంటుఁ జేఁతలఁ గూడీ సిగ్గువడఁడు
గుట్టున శ్రీ వేంకటాద్రిఁ గూడెనిందరు సతుల
దిట్టిమైనవాఁడు గదే తిల్ల గోవిందరాజు
(||pallavi||)
ammalāla akkalāla adivalāla
dimmari gadave vīm̐ḍu tilla goviṁdarāju
(||amma||)
yīvalanāvala sadulirumela nuṁḍam̐gānu
sevamīra navvu navva sigguvaḍam̐ḍu
pūvula nŏgadĕ vesī pŏṁ sŏgadĕdo māḍāḍi
devara gadave vīm̐ḍu tilla goviṁdarāju
(||amma||)
peraḍigā naṁdarunu pĕnam̐gusu nuṁḍam̐gānu
seri kŏṁgulu vaṭṭīni sigguvaḍam̐ḍu
mārugŏnŏgadĕm̐ jūsi marmamu lŏgadĕ naṁṭī
terinavām̐ḍu gadave tillagoviṁdarāju
(||amma||)
yiṭṭĕ pādālŏttam̐gānu iṁdiranu bhūsadini
siṭṭaṁṭum̐ jem̐talam̐ gūḍī sigguvaḍam̐ḍu
guṭṭuna śhrī veṁkaḍādrim̐ gūḍĕniṁdaru sadula
diṭṭimainavām̐ḍu gade tilla goviṁdarāju