Amkegaamda vomgunoodu laubhalesha

అంకెకాఁడ వోఁగునూతు లౌభళేశ
Language

(॥పల్లవి॥)
అంకెకాఁడ వోఁగునూతు లౌభళేశ
పొంకమాయ నీ సతిపొందు మఱవకుమీ

(॥అంకె॥)
తగులనాడినమాట తమితోఁ జూచినచూపు
మగువనేరుపు లివి మఱవకుమీ
చిగురుమోవివిందు సిగ్గుతోడి మురిపెము
నిగిడించినా పెను నీవు మఱవకుమీ

(॥అంకె॥)
సెలవి నవ్విననవ్వు చేతుల మొక్కిన మొక్కు
మలయజగందిచేత మఱవకుమీ
కొలువులో సరసము గుట్టుతోడివినయము
యెలమి నీకెగుణము లిఁక మఱవకుమీ

(॥అంకె॥)
మేనిపై నొత్తినగోరు మిక్కుటపుకాఁగిలి
మానినిచేసిన మేలు మఱవకుమీ
పూని శ్రీవేంకటేశుఁడ భోగములవొడఁబాటు
నానాఁడే ఇచ్చినది యెన్నఁడు మరవకుమీ

(||pallavi||)
aṁkĕgām̐ḍa vom̐gunūdu laubhaḽeśha
pŏṁkamāya nī sadibŏṁdu maṟavagumī

(||aṁkĕ||)
tagulanāḍinamāḍa tamidom̐ jūsinasūbu
maguvanerubu livi maṟavagumī
sigurumoviviṁdu siggudoḍi muribĕmu
nigiḍiṁchinā pĕnu nīvu maṟavagumī

(||aṁkĕ||)
sĕlavi navvinanavvu sedula mŏkkina mŏkku
malayajagaṁdiseda maṟavagumī
kŏluvulo sarasamu guṭṭudoḍivinayamu
yĕlami nīgĕguṇamu lim̐ka maṟavagumī

(||aṁkĕ||)
menibai nŏttinagoru mikkuḍabugām̐gili
māninisesina melu maṟavagumī
pūni śhrīveṁkaḍeśhum̐ḍa bhogamulavŏḍam̐bāḍu
nānām̐ḍe ichchinadi yĕnnam̐ḍu maravagumī