Amke vachchinabu danneenayyeem gaaga

అంకె వచ్చినపు డన్నీనయ్యీఁ గాక
Language

(॥పల్లవి॥)
అంకె వచ్చినపు డన్నీనయ్యీఁ గాక
పొంకము గానియందుకు పోరు గొంత వలెనా

(॥అంకె॥)
మంచిమాటలాడితిఁబో మాపుదాఁకా నీగుణము
చంచలము మాని వోజకు వచ్చీనా
కంచు గంచే పెంచు వెంచే కాలమెంత జరిపినా
పంచనుండి ఇందుకుఁగా బతిమాలవలెనా

(॥అంకె॥)
చేతులెత్తి మొక్కితిఁబో చిత్తములో నీ ప్రేమ
యీతల నేనెంతన్నా నిఁక వచ్చీనా
యేతులేలా రాయి రాయే యెంతైనా గుల్ల గుల్లే
కాతరాన నిందుకుఁగా కాఁకఁ బొందవలెనా

(॥అంకె॥)
ఇట్టె నిన్నుఁ గూడితిఁబో యెరవుల నీకాఁగిలి
జట్టినెంతబిగించినా చవి వుట్టీనా
నెట్టిన శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గలసితి
వెట్టికి యిందుకుఁగా వేగిరించ వలెనా

(||pallavi||)
aṁkĕ vachchinabu ḍannīnayyīm̐ gāga
pŏṁkamu gāniyaṁdugu poru gŏṁta valĕnā

(||aṁkĕ||)
maṁchimāḍalāḍidim̐bo mābudām̐kā nīguṇamu
saṁchalamu māni vojagu vachchīnā
kaṁchu gaṁche pĕṁchu vĕṁche kālamĕṁta jaribinā
paṁchanuṁḍi iṁdugum̐gā badimālavalĕnā

(||aṁkĕ||)
sedulĕtti mŏkkidim̐bo sittamulo nī prema
yīdala nenĕṁtannā nim̐ka vachchīnā
yedulelā rāyi rāye yĕṁtainā gulla gulle
kādarāna niṁdugum̐gā kām̐kam̐ bŏṁdavalĕnā

(||aṁkĕ||)
iṭṭĕ ninnum̐ gūḍidim̐bo yĕravula nīgām̐gili
jaṭṭinĕṁtabigiṁchinā savi vuṭṭīnā
nĕṭṭina śhrīveṁkaḍeśha nīvĕ nannum̐ galasidi
vĕṭṭigi yiṁdugum̐gā vegiriṁcha valĕnā