(॥పల్లవి॥)
అంగనలము గాక ఆసపడక మానము
సంగ తెరిఁగి మన్నించ జాణడవు గావా
(॥అంగ॥)
నిండు గొలువులో నాతో నీవు నవ్వినది నాకు
కొండంత పెద్దరికము కోటికొండలు
అండనే బాగా లిచ్చి ఆదరించితే గనక
వెండియు నందు పై మరి వేలు వున్నదా
(॥అంగ॥)
సవతులలో నాతో సరసమాడితే నది
జవళి జిర పట్టము సామ్రాజ్యము
తివిరి యందు మీదట తేజము చేసితే గన
యివల నాపదవికి యింతంతన నున్నదా
(॥అంగ॥)
యింతేసే వారిలో నాతో యెనసి వుండినలాగు
సంతత సౌభాగ్యము జయ సంపద
కాంతుడ శ్రీవేంకటేశ కరుణించితివి గనక
యింతు లెవ్వరైనా నాతో నీడు వెట్టఁ గలరా
(||pallavi||)
aṁganalamu gāga āsabaḍaga mānamu
saṁga tĕrim̐gi manniṁcha jāṇaḍavu gāvā
(||aṁga||)
niṁḍu gŏluvulo nādo nīvu navvinadi nāgu
kŏṁḍaṁta pĕddarigamu koḍigŏṁḍalu
aṁḍane bāgā lichchi ādariṁchide ganaga
vĕṁḍiyu naṁdu pai mari velu vunnadā
(||aṁga||)
savadulalo nādo sarasamāḍide nadi
javaḽi jira paṭṭamu sāmrājyamu
tiviri yaṁdu mīdaḍa tejamu seside gana
yivala nābadavigi yiṁtaṁtana nunnadā
(||aṁga||)
yiṁtese vārilo nādo yĕnasi vuṁḍinalāgu
saṁtada saubhāgyamu jaya saṁpada
kāṁtuḍa śhrīveṁkaḍeśha karuṇiṁchidivi ganaga
yiṁtu lĕvvarainā nādo nīḍu vĕṭṭam̐ galarā