Amganajavvana maamanigaalamu

అంగనజవ్వన మామనికాలము
Language

(॥పల్లవి॥)
అంగనజవ్వన మామనికాలము
సంగడినె నీకు జడిగొనె వలపు

(॥॥)
తీగెమెఱుఁగులు తెఱవచూపులు
బాగైనమేఘమ్ము బలుకొప్పు
చేగదేర రతిచెమట వానలు
యీగతిఁ గురిసె నింతాయ వలపు

(॥॥)
యింతిమోవి కెంపు లింద్రగోపములు
చెంతఁ గోరికలు సెలయేరులు
పొంతనున్న నీరుబుగ్గలు పులకలు
అంతటాఁదొరుగఁగా నసలాయ వలపు

(॥॥)
అలమేలుమంగ మోహము నిగిడినసోన
నెలకొన్న చెరువు నీమనసు
వలనై శ్రీవెంకటేశ్వర నీవు గూడఁగ
ఫలమై జగములోనఁ బదనాయ వలపు

(||pallavi||)
aṁganajavvana māmanigālamu
saṁgaḍinĕ nīgu jaḍigŏnĕ valabu

(||||)
tīgĕmĕṟum̐gulu tĕṟavasūbulu
bāgainameghammu balugŏppu
segadera radisĕmaḍa vānalu
yīgadim̐ gurisĕ niṁtāya valabu

(||||)
yiṁtimovi kĕṁpu liṁdragobamulu
sĕṁtam̐ gorigalu sĕlayerulu
pŏṁtanunna nīrubuggalu pulagalu
aṁtaḍām̐dŏrugam̐gā nasalāya valabu

(||||)
alamelumaṁga mohamu nigiḍinasona
nĕlagŏnna sĕruvu nīmanasu
valanai śhrīvĕṁkaḍeśhvara nīvu gūḍam̐ga
phalamai jagamulonam̐ badanāya valabu