Amganagu maarugamma lampavayyaa

అంగనకు మారుగమ్మ లంపవయ్యా
Language

(॥పల్లవి॥)
అంగనకు మారుగమ్మ లంపవయ్యా
యింగితములోనే కంటి మేమందుమయ్యా

(॥॥)
యెంతపిలిచినా రావు యెగసక్కేలాడేవు
చెంతల మాచెలికట్టే చెప్పుదుమా
ఇంతలో నేము మొక్కితే నిటు సరససాలాడేవు
యెంత కెత్తుకొంటివి నిన్నేమందుమయ్యా

(॥॥)
కానుకము నందుకోవు కైదండ విడువవు
కానీ కానీ యాపె యెఱగక మానీనా
లోనికి రాఁజూచి పై గల్లునఁ బాదము చాఁచేవు
యీనెపము గాచుకుంటి వేమందుమయ్యా

(॥॥)
అసలనుఁ బెట్టేవు అతివను రమ్మనేవు
వేసరి యాకె యీడకు విచ్చేసెనయ్యా
సేసవెట్టి కూడితి శ్రీవేంకటేశ నీవు
యీ సుద్దులకిఁక మరి యేమందుమయ్యా

(||pallavi||)
aṁganagu mārugamma laṁpavayyā
yiṁgidamulone kaṁṭi memaṁdumayyā

(||||)
yĕṁtabilisinā rāvu yĕgasakkelāḍevu
sĕṁtala māsĕligaṭṭe sĕppudumā
iṁtalo nemu mŏkkide niḍu sarasasālāḍevu
yĕṁta kĕttugŏṁṭivi ninnemaṁdumayyā

(||||)
kānugamu naṁdugovu kaidaṁḍa viḍuvavu
kānī kānī yābĕ yĕṟagaga mānīnā
lonigi rām̐jūsi pai gallunam̐ bādamu sām̐sevu
yīnĕbamu gāsuguṁṭi vemaṁdumayyā

(||||)
asalanum̐ bĕṭṭevu adivanu rammanevu
vesari yāgĕ yīḍagu vichchesĕnayyā
sesavĕṭṭi kūḍidi śhrīveṁkaḍeśha nīvu
yī suddulagim̐ka mari yemaṁdumayyā