Amganaa neevunu maadalaadugorayyaa

అంగనా నీవును మాటలాడుకోరయ్యా
Language

(॥పల్లవి॥)
అంగనా నీవును మాటలాడుకోరయ్యా
చెంగటనున్న చెలులు నేసేపని యేదయ్యా

(॥॥)
వలపు లినుమడించె వాడికె లెదిరించె
చెలికి నీకు వావులు చిగిరించెను
తలఁపులు దైవారె తమకములు సందించె
యెలమి సుద్దులు మమ్ము నేమడిగేవయ్యా

(॥॥)
కొనచూపులు గదిసె కోరిక లల్లులొనె
మన లిద్దరివిని మర్మము లంటె
ననుపులు సరిదాఁ కె నవ్వులు వియ్యములందె
యెనలేనివిచారము లిఁక నేఁటికయ్యా

(॥॥)
మోవు లొక్కమరె మాఁగె మోహము లొండొంటి ముట్టె
భావించ సమరతులు బంతికి వచ్చె
శ్రీవేంకటేశ యింతిఁ జేకొని కూడితి విట్టె
యీవేళ నీసంతోసము లెంత చుపేవయ్యా

(||pallavi||)
aṁganā nīvunu māḍalāḍugorayyā
sĕṁgaḍanunna sĕlulu nesebani yedayyā

(||||)
valabu linumaḍiṁchĕ vāḍigĕ lĕdiriṁchĕ
sĕligi nīgu vāvulu sigiriṁchĕnu
talam̐pulu daivārĕ tamagamulu saṁdiṁchĕ
yĕlami suddulu mammu nemaḍigevayyā

(||||)
kŏnasūbulu gadisĕ koriga lallulŏnĕ
mana liddarivini marmamu laṁṭĕ
nanubulu saridām̐ kĕ navvulu viyyamulaṁdĕ
yĕnalenivisāramu lim̐ka nem̐ṭigayyā

(||||)
movu lŏkkamarĕ mām̐gĕ mohamu lŏṁḍŏṁṭi muṭṭĕ
bhāviṁcha samaradulu baṁtigi vachchĕ
śhrīveṁkaḍeśha yiṁtim̐ jegŏni kūḍidi viṭṭĕ
yīveḽa nīsaṁtosamu lĕṁta subevayyā