అంగన వీడెమిచ్చీని అందుకోవయ్య
(॥పల్లవి॥)
అంగన వీడెమిచ్చీని అందుకోవయ్య
ముంగిటి అడియాసలు మోపుగట్ట వసమా
(॥అంగ॥)
యెలమి నెఱిఁగియును నెఱఁగనట్టే వుంటే
తెలుపఁగ వసమా తేటలుగాను
వెలయఁ గపటానకు విరహనఁ బొరలితే
చలిమందులు సేయఁగ సతులకు వసమా
(॥అంగ॥)
నేరిచి వుండియును నేరనని యంటేను
నేరుపంగ వసమా నెరువుగాను
పారితెంచి వేసాలకు బడలికె దెచ్చుకొంటే
ఆరీతి విసరుచు నలపార్చ వసమా
(॥అంగ॥)
యేపున గురుతు గని యేది యని యడిగితే
చూపి చెప్పవచ్చునా సూట్లు గాను
చేపట్టెల మేల్మంగను శ్రీ వేంకటేశ కూడితి
తీపుగా వలచితివి తియ్యనిఁక వసమా
(||pallavi||)
aṁgana vīḍĕmichchīni aṁdugovayya
muṁgiḍi aḍiyāsalu mobugaṭṭa vasamā
(||aṁga||)
yĕlami nĕṟim̐giyunu nĕṟam̐ganaṭṭe vuṁṭe
tĕlubam̐ga vasamā teḍalugānu
vĕlayam̐ gabaḍānagu virahanam̐ bŏralide
salimaṁdulu seyam̐ga sadulagu vasamā
(||aṁga||)
nerisi vuṁḍiyunu neranani yaṁṭenu
nerubaṁga vasamā nĕruvugānu
pāridĕṁchi vesālagu baḍaligĕ dĕchchugŏṁṭe
ārīdi visarusu nalabārsa vasamā
(||aṁga||)
yebuna gurudu gani yedi yani yaḍigide
sūbi sĕppavachchunā sūṭlu gānu
sebaṭṭĕla melmaṁganu śhrī veṁkaḍeśha kūḍidi
tībugā valasidivi tiyyanim̐ka vasamā