Amgana sesina punya mamdagabodu

అంగన చేసిన పుణ్య మందకపోదు
Language

(॥పల్లవి॥)
అంగన చేసిన పుణ్య మందకపోదు
చెంగటఁ జూడరమ్మ చెలులాల మీరు

(॥అంగ॥)
దొంతరపూవులపూజ తొయ్యలి సేయఁగఁబోలు
చింతతో నిట్టె చేయి చేర్చె నేఁడు
యింతి నీలపురాసు లిలఁ జూరలియ్యఁబోలు
చెంతఁ దురుమటు జారి చిక్కువడె నదివో

(॥అంగ॥)
దిట్టయై కోరి యఖండదీప మెత్తఁగఁబోలు
నిట్టచూపే చూచీని నివ్వెరగై
జట్టిగొని పన్నీటఁ జలిపంది రిడఁబోలు
వుట్టిపడి చెమటల నోలలాడె నదివో

(॥అంగ॥)
వనిత మోవిపండు వాయనమియ్యఁగఁబోలు
మొనసి శ్రీవేంకటేశు మోవి చేకొనె
తనివోక చెప్పరానితపము సేయఁగఁబోలు
యెనసి ఇద్దరుఁ గూడి యేకమై రిదివో

(||pallavi||)
aṁgana sesina puṇya maṁdagabodu
sĕṁgaḍam̐ jūḍaramma sĕlulāla mīru

(||aṁga||)
dŏṁtarabūvulabūja tŏyyali seyam̐gam̐bolu
siṁtado niṭṭĕ seyi sersĕ nem̐ḍu
yiṁti nīlaburāsu lilam̐ jūraliyyam̐bolu
sĕṁtam̐ durumaḍu jāri sikkuvaḍĕ nadivo

(||aṁga||)
diṭṭayai kori yakhaṁḍadība mĕttam̐gam̐bolu
niṭṭasūbe sūsīni nivvĕragai
jaṭṭigŏni pannīḍam̐ jalibaṁdi riḍam̐bolu
vuṭṭibaḍi sĕmaḍala nolalāḍĕ nadivo

(||aṁga||)
vanida movibaṁḍu vāyanamiyyam̐gam̐bolu
mŏnasi śhrīveṁkaḍeśhu movi segŏnĕ
tanivoga sĕpparānidabamu seyam̐gam̐bolu
yĕnasi iddarum̐ gūḍi yegamai ridivo