అంగన నింతటనైనా నలపు దీర్చరాదా
(॥పల్లవి॥)
అంగన నింతటనైనా నలపు దీర్చరాదా
సంగతెఱిఁగిన నెరజాణఁడ విన్నిటాను
(॥అంగ॥)
చెమరించె నుదురెల్లా చెదరెఁ గస్తూరిబొట్టు
జమళిపాదాలు ఇంతి సారె గుద్దంగా
తమిఁ దురుముజారె గందపుబేంట్లెత్తె మేన
గుమితాన నీకు నిట్టె కుంచెవేయఁగా
(॥అంగ॥)
పైపై నిట్టూర్పులు రేఁగె బాయిటఁబడెఁ జన్నులు
యేపున నాకుమడిచిఇయ్యఁగాను
తీపులమోవి వాడె తెట్టెలై పూవులు రాలె
ఆపోద్దుననుండి జవ్వా దలఁదఁగాను
(॥అంగ॥)
కన్నుల నిద్దుర దేరె కళలు మోమున నిండె
ఇన్నిటాఁ గాఁగిట ని న్నెనయఁగాను
వున్నతి శ్రీవేంకటేశ వొడి నిండె వలపులు
చెన్నుమీర నీకు నిట్టె సేవసేయఁగాను
(||pallavi||)
aṁgana niṁtaḍanainā nalabu dīrsarādā
saṁgadĕṟim̐gina nĕrajāṇam̐ḍa vinniḍānu
(||aṁga||)
sĕmariṁchĕ nudurĕllā sĕdarĕm̐ gastūribŏṭṭu
jamaḽibādālu iṁti sārĕ guddaṁgā
tamim̐ durumujārĕ gaṁdabubeṁṭlĕttĕ mena
gumidāna nīgu niṭṭĕ kuṁchĕveyam̐gā
(||aṁga||)
paibai niṭṭūrbulu rem̐gĕ bāyiḍam̐baḍĕm̐ jannulu
yebuna nāgumaḍisiiyyam̐gānu
tībulamovi vāḍĕ tĕṭṭĕlai pūvulu rālĕ
āboddunanuṁḍi javvā dalam̐dam̐gānu
(||aṁga||)
kannula niddura derĕ kaḽalu momuna niṁḍĕ
inniḍām̐ gām̐giḍa ni nnĕnayam̐gānu
vunnadi śhrīveṁkaḍeśha vŏḍi niṁḍĕ valabulu
sĕnnumīra nīgu niṭṭĕ sevaseyam̐gānu