Amgana ni nnadigi rammane nee maada

అంగన ని న్నడిగి రమ్మనె నీ మాట
Language

(॥పల్లవి॥)
అంగన ని న్నడిగి రమ్మనె నీ మాట
సంగతిగ మరుమాట సరి నానతీవయ్యా

(॥॥)
చెలులచే నింతి నీకు చెప్పి పంపిన మాటలు
తలఁచుకొన్నాఁడవా దయతో నీవు
తొలుతఁ గాను కంపిన దొడ్డ పూవుల బంతి
లలిమించిన పరిమళము గొంటివా

(॥॥)
చాయల నాతో నాపె సారెఁ జూచిన చూపులు
ఆయములు గరఁచెనా అంటుకొనెనా
చేయెత్తి సిగ్గు తోడ చేరి మొక్కిన మొక్కులు
ఆయనా నీకు శలవు అందరిలోనా

(॥॥)
బెరసి తెరమాటునఁ బెట్టిన నీపై సేసలు
శిరసుపై నిండెనా చిందెనా నీపై
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
గరిమ నిన్నుఁ గూడి గద్దెపైఁగూచున్నది

(||pallavi||)
aṁgana ni nnaḍigi rammanĕ nī māḍa
saṁgadiga marumāḍa sari nānadīvayyā

(||||)
sĕlulase niṁti nīgu sĕppi paṁpina māḍalu
talam̐sugŏnnām̐ḍavā dayado nīvu
tŏludam̐ gānu kaṁpina dŏḍḍa pūvula baṁti
lalimiṁchina parimaḽamu gŏṁṭivā

(||||)
sāyala nādo nābĕ sārĕm̐ jūsina sūbulu
āyamulu garam̐sĕnā aṁṭugŏnĕnā
seyĕtti siggu toḍa seri mŏkkina mŏkkulu
āyanā nīgu śhalavu aṁdarilonā

(||||)
bĕrasi tĕramāḍunam̐ bĕṭṭina nībai sesalu
śhirasubai niṁḍĕnā siṁdĕnā nībai
arudai śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
garima ninnum̐ gūḍi gaddĕbaim̐gūsunnadi