Amgana needom benamgadamtaa nela saadimchevu

అంగన నీతోఁ బెనఁగదంటా నేల సాదించేవు
Language

(॥పల్లవి॥)
అంగన నీతోఁ బెనఁగదంటా నేల సాదించేవు
చెంగలువ వంటిదిది చెనక నిన్నోపునా

(॥॥)
నెలవుల నవ్వేది సిగ్గుతోడ నుండేది
వలపులసొల పాఁడువారిసాజము
చనివాయ లాలించేది చనవులు చెల్లించేది
నెలకొని మన్నంచేది నీచేతి దిఁకను

(॥॥)
తనినోవక చూచేది దండనే నిలుచుండేది
గనమైనవినయమే కాంతలవోజ
మనసిచ్చి మాఁటాడేది మచ్చికతోఁ గలసేది
నిను సేవించనిచ్చేది నీచేత దిఁ కననీ

(॥॥)
గుట్టుతోడ నుండేది నుండేది కొసరుచు మొక్కేది
దటపుటాసలు వనితలగుణము
యిట్టె శ్రీ వేంకటేశ యీకె నేలుకొంటివి
నెట్టనఁ బాయకుండేది నీచేతి దిఁకను

(||pallavi||)
aṁgana nīdom̐ bĕnam̐gadaṁṭā nela sādiṁchevu
sĕṁgaluva vaṁṭididi sĕnaga ninnobunā

(||||)
nĕlavula navvedi siggudoḍa nuṁḍedi
valabulasŏla pām̐ḍuvārisājamu
sanivāya lāliṁchedi sanavulu sĕlliṁchedi
nĕlagŏni mannaṁchedi nīsedi dim̐kanu

(||||)
taninovaga sūsedi daṁḍane nilusuṁḍedi
ganamainavinayame kāṁtalavoja
manasichchi mām̐ṭāḍedi machchigadom̐ galasedi
ninu seviṁchanichchedi nīseda dim̐ kananī

(||||)
guṭṭudoḍa nuṁḍedi nuṁḍedi kŏsarusu mŏkkedi
daḍabuḍāsalu vanidalaguṇamu
yiṭṭĕ śhrī veṁkaḍeśha yīgĕ nelugŏṁṭivi
nĕṭṭanam̐ bāyaguṁḍedi nīsedi dim̐kanu