(॥పల్లవి॥)
అంగన నీపతి రపమాయఁ గదవే
ముంగిటి సిగ్గులు పెద్ద మోపాయఁ గదవే
(॥అంగన॥)
నగవుకొలఁది గాదు నాలి నీ చెక్కుచెమట
దగదొట్టి పయ్య దంతాఁ దడిసెఁ గదే
పగటు నీ చన్ను లంటి బట్టిబాయటఁ బడెను
వొగి నొకటి సేయంగ నొకటాయఁ గదవే
(॥అంగన॥)
పెనఁగేకొలఁది గాదు పెట్టుకొన్న నీ తురుము
పనివడి విడువా ముడువా బట్టె గదవే
ననుపున నందు వంక నా టి కొనగోరి వాఁడి
గునిసీ కలకాలము గుఱుతాయఁ గదవే
(॥అంగన॥)
కూడినకొలఁది గాదు గుంపులైన పులకలు
ఆడనే సొమ్ములు బిగువాయఁ గదవే
తోడ శ్రీవేంకటేశుఁడు దొమ్మిరతులఁ గలసె
చూడఁ జూడ నవ్వు లెల్లా సూడిదాయఁ గదవే
(||pallavi||)
aṁgana nībadi rabamāyam̐ gadave
muṁgiḍi siggulu pĕdda mobāyam̐ gadave
(||aṁgana||)
nagavugŏlam̐di gādu nāli nī sĕkkusĕmaḍa
dagadŏṭṭi payya daṁtām̐ daḍisĕm̐ gade
pagaḍu nī sannu laṁṭi baṭṭibāyaḍam̐ baḍĕnu
vŏgi nŏgaḍi seyaṁga nŏgaḍāyam̐ gadave
(||aṁgana||)
pĕnam̐gegŏlam̐di gādu pĕṭṭugŏnna nī turumu
panivaḍi viḍuvā muḍuvā baṭṭĕ gadave
nanubuna naṁdu vaṁka nā ṭi kŏnagori vām̐ḍi
gunisī kalagālamu guṟudāyam̐ gadave
(||aṁgana||)
kūḍinagŏlam̐di gādu guṁpulaina pulagalu
āḍane sŏmmulu biguvāyam̐ gadave
toḍa śhrīveṁkaḍeśhum̐ḍu dŏmmiradulam̐ galasĕ
sūḍam̐ jūḍa navvu lĕllā sūḍidāyam̐ gadave