Amgana naasalanela alayimchevu

అంగన నాసలనేల అలయించేవు
Language

(॥పల్లవి॥)
అంగన నాసలనేల అలయించేవు
అంగవించి కూడరాదా ఆయిత్తమై వున్నది

(॥అంగ॥)
వెనక నవ్వేవుగాని విడె మందుకొనరాదా
తనివోనికోరికలఁ దగులున్నది
చనవు లిచ్చేవుగాని సరసములాడరాదా
పెనగొన్నరతులకుఁ బ్రియమందివున్నది

(॥అంగ॥)
కప్పుర మిచ్చేవుగాని కాఁగిలించుకొనరాదా
కప్పినవేడుకలతోఁ గాచుకున్నది
కోప్పు దువ్వేవుగాని గొబ్బున మోవియ్యరాదా
దప్పిదేరేముచ్చటలఁ దమకించి వున్నది

(॥అంగ॥)
మాటలాడుదువుగాని మర్మము లంటఁగరాదా
యీటున నీచుట్టరిక మెంచుకున్నది
గాఁటపు శ్రీవేంకటేశ రాంత యలమేలువంగ
మేటివై నీవు గూడఁగ మెచ్చుకొనివున్నది

(||pallavi||)
aṁgana nāsalanela alayiṁchevu
aṁgaviṁchi kūḍarādā āyittamai vunnadi

(||aṁga||)
vĕnaga navvevugāni viḍĕ maṁdugŏnarādā
tanivonigorigalam̐ dagulunnadi
sanavu lichchevugāni sarasamulāḍarādā
pĕnagŏnnaradulagum̐ briyamaṁdivunnadi

(||aṁga||)
kappura michchevugāni kām̐giliṁchugŏnarādā
kappinaveḍugaladom̐ gāsugunnadi
koppu duvvevugāni gŏbbuna moviyyarādā
dappideremuchchaḍalam̐ damagiṁchi vunnadi

(||aṁga||)
māḍalāḍuduvugāni marmamu laṁṭam̐garādā
yīḍuna nīsuṭṭariga mĕṁchugunnadi
gām̐ṭabu śhrīveṁkaḍeśha rāṁta yalameluvaṁga
meḍivai nīvu gūḍam̐ga mĕchchugŏnivunnadi