Amgana naa padidoda namtivaa neevu

అంగన నా పతితోడ నంటివా నీవు
Language

(॥పల్లవి॥)
అంగన నా పతితోడ నంటివా నీవు
అంగడి కెక్కె వలపు లంటివా నీవు

(॥అంగ॥)
చేతుల మొక్కి తినవి సిగ్గుతో నుందాననని
అతనితో నీమాఁట అంటివా నీవు
నాతలఁపెఱుఁగుమని నమ్మితి నన్నిటానని
అతుమలో విలువఁగ నంటివా నీవు

(॥అంగ॥)
నానితిఁ జెమటనని నవ్వులకు లోనని
అసలు మరవనని అంటివా నీవు
వీనుల నాలించుమని విన్నపముల లివేయని
బనదయ్యీ దానే గతి యంటివా నీవు

(॥అంగ॥)
కప్పురపుఁబడియ నీకాఁగిలి నాసొమ్మని
అప్పణ నాకిమ్మని అంటివా నీవు
యిప్పుడే శ్రీవేంకటేశ యేలితివి నన్నునని
అప్పుడే మెద్చతినని యంటివా నీవు

(||pallavi||)
aṁgana nā padidoḍa naṁṭivā nīvu
aṁgaḍi kĕkkĕ valabu laṁṭivā nīvu

(||aṁga||)
sedula mŏkki tinavi siggudo nuṁdānanani
adanido nīmām̐ṭa aṁṭivā nīvu
nādalam̐pĕṟum̐gumani nammidi nanniḍānani
adumalo viluvam̐ga naṁṭivā nīvu

(||aṁga||)
nānidim̐ jĕmaḍanani navvulagu lonani
asalu maravanani aṁṭivā nīvu
vīnula nāliṁchumani vinnabamula liveyani
banadayyī dāne gadi yaṁṭivā nīvu

(||aṁga||)
kappurabum̐baḍiya nīgām̐gili nāsŏmmani
appaṇa nāgimmani aṁṭivā nīvu
yippuḍe śhrīveṁkaḍeśha yelidivi nannunani
appuḍe mĕdchadinani yaṁṭivā nīvu