అంగన మోహము నీపై నటువంటిదా
(॥పల్లవి॥)
అంగన మోహము నీపై నటువంటిదా
యింగిత మెఱఁగవా నీ వింత దొరవు
(॥అంగ॥)
సిగ్గువడి యాపె నీతో శిరసు వంచుకుండఁగా
దగ్గర లోఁగే వదేమి దంటవాఁడవు
యెగ్గున నీ వలఁ(ల్లఁ?) దప్పు యేమైనాఁ గలదోనేఁడు
వొగ్గి నీకు ఆపె యిందు వొరటులాడీనా
(॥అంగ॥)
కన్నెపాయ మటుగాన కాంత పలుకఁగ వుంటే
పన్ని యేల పైఁకొనవు ప్రౌఢవాఁడవు
యెన్నికలు యేమైనా యెంచుకొన్నవిఁగలవో
అన్నిటా నీ వేమనినా అవుఁగాదనీనా
(॥అంగ॥)
నెలఁత నిన్నుఁ గలసి నివ్వెరగైయుండఁగాను
యెలయించకు శ్రీ వేంకటేశ్వరుఁడవు
అలుకదేరి కూడితి వాస లేమైనాఁ గలవో
చెలియ నీ చెప్పినట్లు సేయకమానీనా
(||pallavi||)
aṁgana mohamu nībai naḍuvaṁṭidā
yiṁgida mĕṟam̐gavā nī viṁta dŏravu
(||aṁga||)
sigguvaḍi yābĕ nīdo śhirasu vaṁchuguṁḍam̐gā
daggara lom̐ge vademi daṁṭavām̐ḍavu
yĕgguna nī valam̐(llam̐?) dappu yemainām̐ galadonem̐ḍu
vŏggi nīgu ābĕ yiṁdu vŏraḍulāḍīnā
(||aṁga||)
kannĕbāya maḍugāna kāṁta palugam̐ga vuṁṭe
panni yela paim̐kŏnavu prauḍhavām̐ḍavu
yĕnnigalu yemainā yĕṁchugŏnnavim̐galavo
anniḍā nī vemaninā avum̐gādanīnā
(||aṁga||)
nĕlam̐ta ninnum̐ galasi nivvĕragaiyuṁḍam̐gānu
yĕlayiṁchagu śhrī veṁkaḍeśhvarum̐ḍavu
alugaderi kūḍidi vāsa lemainām̐ galavo
sĕliya nī sĕppinaṭlu seyagamānīnā