Amgana lellaa adivo nemdu

అంగన లెల్లా అదివో నేఁడు
Language

(॥పల్లవి॥)
అంగన లెల్లా అదివో నేఁడు
అంగములు పులకించె నదివో నేఁడు

(॥॥)
చేరి నీవు విలువగా సిగ్గువ నాపె లోఁగఁగా
ఆరితేరె వలపులు అదివో నేఁడు
గారవించఁగా నీవు కాంత నీకు మొక్కఁగాను
అరగించి వేళలేదు అదివో నేఁడు

(॥॥)
అంది నీవు చెనకఁగా నాపె యిల్లు చొచ్చుకోఁగా
అందరు నెఱిఁగి రీపనదివో నేఁడు
చెంది నీవు వెనగఁగా చెలి సరసమాడఁగా
అందమాయ గోరితాఁకులదివో నేఁడు

(॥॥)
సేస నీవు వెట్టఁ గాను సెలవి నాపె నవ్వఁగా-
నా సుద్దులింతటా నిండె నదివో నేఁడు
శ్రీసతినిఁ గూడితివి శ్రీవేంకటేశ నేఁడు
ఆస లిద్దరికెక్కుడు అదివో నేఁడు

(||pallavi||)
aṁgana lĕllā adivo nem̐ḍu
aṁgamulu pulagiṁchĕ nadivo nem̐ḍu

(||||)
seri nīvu viluvagā sigguva nābĕ lom̐gam̐gā
āriderĕ valabulu adivo nem̐ḍu
gāraviṁcham̐gā nīvu kāṁta nīgu mŏkkam̐gānu
aragiṁchi veḽaledu adivo nem̐ḍu

(||||)
aṁdi nīvu sĕnagam̐gā nābĕ yillu sŏchchugom̐gā
aṁdaru nĕṟim̐gi rībanadivo nem̐ḍu
sĕṁdi nīvu vĕnagam̐gā sĕli sarasamāḍam̐gā
aṁdamāya goridām̐kuladivo nem̐ḍu

(||||)
sesa nīvu vĕṭṭam̐ gānu sĕlavi nābĕ navvam̐gā-
nā sudduliṁtaḍā niṁḍĕ nadivo nem̐ḍu
śhrīsadinim̐ gūḍidivi śhrīveṁkaḍeśha nem̐ḍu
āsa liddarigĕkkuḍu adivo nem̐ḍu