(॥పల్లవి॥)
అంగన లీరే యారతులు
అంగజగురునకు నారతులూ
(॥॥)
శ్రీదేవితోడుతఁ జెలఁగుచు నవ్వే-
ఆదిమపురుషుని కారతులూ
మేదినీరమణి మేలములాడేటి-
ఆదిత్యతేజున కారతులూ
(॥॥)
సురులకు నమృతము సొరది నొసంగిన-
హరి కిదివో పసిఁడారతులూ
తరమిది దుష్టుల దనుజుల నడఁచిన-
అరిభయంకరున కారతులూ
(॥॥)
నిచ్చలుఁ గల్యాణనిధియై యేఁగేటి-
అచ్చుతునకు నివె యారతులూ
చొచ్చి శ్రీ వేంకటేశుఁడు నలమేల్మంగ
యచ్చుగ నిలిచిరి యారతులూ
(||pallavi||)
aṁgana līre yāradulu
aṁgajagurunagu nāradulū
(||||)
śhrīdevidoḍudam̐ jĕlam̐gusu navve-
ādimaburuṣhuni kāradulū
medinīramaṇi melamulāḍeḍi-
ādityadejuna kāradulū
(||||)
surulagu namṛtamu sŏradi nŏsaṁgina-
hari kidivo pasim̐ḍāradulū
taramidi duṣhṭula danujula naḍam̐sina-
aribhayaṁkaruna kāradulū
(||||)
nichchalum̐ galyāṇanidhiyai yem̐geḍi-
achchudunagu nivĕ yāradulū
sŏchchi śhrī veṁkaḍeśhum̐ḍu nalamelmaṁga
yachchuga nilisiri yāradulū