(॥పల్లవి॥)
అంగన లాతనివేళ అరసిరారో
సింగారరాయఁడు యేమిసేసీనో యీవేళ
(॥అంగ॥)
వుప్పవడమౌ నిఁతక వువిదయుఁ దానీవేళ
అప్పఁడు దధ్యన్నము లారగించు నీవేళ
అప్పుడే మొకమజ్జన నువధరించు నీవేళ
ఇప్పు డేమిసేసీనో యెఱఁగ మీవేళ
(॥అంగ॥)
తిరువారాధనవేళ తిరువందికాపువేళ
అరిది యప్పాలు నన్నాలారగించు నీవేళ
దొలరకొలు నీవేళ తోదోపు లీవేళ
సిరివరుఁడిపు డేమిసేసునో యీవేళ
(॥అంగ॥)
యిట్టే యలమేలుమంగ యేకతమాడేవేళ
చుట్టి రా సంగరంగాలు చూచేవేళ
మెట్టి శ్రీవేంకటపతి మెరసి యేఁగేవేళ
చెట్టాపట్టాలతో రతిఁ జెలఁగు నీవేళ
(||pallavi||)
aṁgana lādaniveḽa arasirāro
siṁgārarāyam̐ḍu yemisesīno yīveḽa
(||aṁga||)
vuppavaḍamau nim̐taga vuvidayum̐ dānīveḽa
appam̐ḍu dadhyannamu lāragiṁchu nīveḽa
appuḍe mŏgamajjana nuvadhariṁchu nīveḽa
ippu ḍemisesīno yĕṟam̐ga mīveḽa
(||aṁga||)
tiruvārādhanaveḽa tiruvaṁdigābuveḽa
aridi yappālu nannālāragiṁchu nīveḽa
dŏlaragŏlu nīveḽa todobu līveḽa
sirivarum̐ḍibu ḍemisesuno yīveḽa
(||aṁga||)
yiṭṭe yalamelumaṁga yegadamāḍeveḽa
suṭṭi rā saṁgaraṁgālu sūseveḽa
mĕṭṭi śhrīveṁkaḍabadi mĕrasi yem̐geveḽa
sĕṭṭābaṭṭālado radim̐ jĕlam̐gu nīveḽa