Amgadiveduraa vala pamdarum joodamganu

అంగడివేతురా వల పందరుఁ జూడఁగను
Language

(॥పల్లవి॥)
అంగడివేతురా వల పందరుఁ జూడఁగను
చెంగట నాపెకు నైనా సిగ్గు గొంత వలదా

(॥అంగడి॥)
తా నింత నేర్పరి యౌట తరుణు లెఱుఁగరా
అనిపట్టి ఆపెకు నాట నేర్పీని
వీనుల నిందాక నేను విని తల యూఁచనా
తానాలు దిద్దీని యట్టే దండ నిడికొనుచు

(॥అంగడి॥)
కన్నెపై బత్తి గలుగుత కానరా వూరివారెల్లా
చన్నులొత్తుగాఁ గిన్నెర సాదింపించీని
సన్నలదాశాలు వాయించ జేయఁగమెచ్చనా
చిన్నిచేతులు వట్టి తా సిగ్గులు వడుచును

(॥అంగడి॥)
దిక్కుల తనసొమ్మవుట తెలియరా చెలు లెల్లా
చక్క మెడఁకు గట్టుకొని చదివించీని
చెక్కు నొక్కి నన్నుఁ గూడి శ్రీవేంకటేశుఁ డాపె
వక్కణలు చెప్పి చెప్పి వ్రాఁతలు వాయించీని

(||pallavi||)
aṁgaḍivedurā vala paṁdarum̐ jūḍam̐ganu
sĕṁgaḍa nābĕgu nainā siggu gŏṁta valadā

(||aṁgaḍi||)
tā niṁta nerbari yauḍa taruṇu lĕṟum̐garā
anibaṭṭi ābĕgu nāḍa nerbīni
vīnula niṁdāga nenu vini tala yūm̐sanā
tānālu diddīni yaṭṭe daṁḍa niḍigŏnusu

(||aṁgaḍi||)
kannĕbai batti galuguda kānarā vūrivārĕllā
sannulŏttugām̐ ginnĕra sādiṁpiṁchīni
sannaladāśhālu vāyiṁcha jeyam̐gamĕchchanā
sinnisedulu vaṭṭi tā siggulu vaḍusunu

(||aṁgaḍi||)
dikkula tanasŏmmavuḍa tĕliyarā sĕlu lĕllā
sakka mĕḍam̐ku gaṭṭugŏni sadiviṁchīni
sĕkku nŏkki nannum̐ gūḍi śhrīveṁkaḍeśhum̐ ḍābĕ
vakkaṇalu sĕppi sĕppi vrām̐talu vāyiṁchīni