Amgadim bettevu mammu naunoyi baava nee

అంగడిఁ బెట్టేవు మమ్ము నౌనోయి బావ నీ
Language

(॥పల్లవి॥)
అంగడిఁ బెట్టేవు మమ్ము నౌనోయి బావ నీ-
ఇంగితము లెల్లాఁ గంటి మింకానా బావా

(॥అంగ॥)
సారె నీరాటి రేవులజాణత నాలా బావ
గోరికొనకు లోఁగాని గొంటరిబావ
కోర సోఁకీ వలపులు గుద్దలించేవా బావ
రారాదా మానికింద రచ్చసేసేబావా

(॥అంగ॥)
కందువ నెందుకునైనాఁ గాలు చాఁచే విట్టే బావ
చెంది సూడుకుఁ బాడుకుఁ జిమ్మేటిబావ
విందువలె నాఁటదాని వెదకి వచ్చేటిబావా
నిందలు నీపై మోఁచేనీవారమో బావా

(॥అంగ॥)
యెగ్గు సిగ్గు లెరఁగవు ఇది యేఁటి దోయి బావ
వెగ్గళించేవు కలికివిద్యల బావ
అగ్గమై శ్రీవేంకటేశ అట్లానే నన్నుఁ గూడి
నిగ్గుదేర మన్నించితి నీవే నే నోబావా

(||pallavi||)
aṁgaḍim̐ bĕṭṭevu mammu naunoyi bāva nī-
iṁgidamu lĕllām̐ gaṁṭi miṁkānā bāvā

(||aṁga||)
sārĕ nīrāḍi revulajāṇada nālā bāva
gorigŏnagu lom̐gāni gŏṁṭaribāva
kora som̐kī valabulu guddaliṁchevā bāva
rārādā mānigiṁda rachchasesebāvā

(||aṁga||)
kaṁduva nĕṁdugunainām̐ gālu sām̐se viṭṭe bāva
sĕṁdi sūḍugum̐ bāḍugum̐ jimmeḍibāva
viṁduvalĕ nām̐ṭadāni vĕdagi vachcheḍibāvā
niṁdalu nībai mom̐senīvāramo bāvā

(||aṁga||)
yĕggu siggu lĕram̐gavu idi yem̐ṭi doyi bāva
vĕggaḽiṁchevu kaligividyala bāva
aggamai śhrīveṁkaḍeśha aṭlāne nannum̐ gūḍi
niggudera manniṁchidi nīve ne nobāvā