Amgadim bette vayasu adiyaala maanune

అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే
Language

(॥పల్లవి॥)
అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే
బెంగతనాన నుండినాఁ బెడరేఁచుఁ గాక

(॥అంగ॥)
వాసికి నెంతలిగినా వలపేల తక్కువౌను
ఆసలతోఁ జిగిరించి అలరుఁగాక
యీసున నెంతదిట్టినా ఇంపులేల కొంచమౌను
వేసరనిపులకలై విఱ్ఱవీఁగుఁగాక

(॥అంగ॥)
ఆకడిమోమెఁతైనా ఆయమేల వూరకుండు
దీకొని తమకమై తిమురుఁగాక
చేకొని మాటాడకుంటే చిత్తమేల మరపించు
కాకుసేసి లోలోనె కరఁగించుఁగాక

(॥అంగ॥)
చేయి చాఁచకుంటేను సెలవి నవ్వేల వుండు
తోయరానిసరసమై తొడరుఁగాక
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వేయిటికి నీరతులు వింతసేసుఁగాక

(||pallavi||)
aṁgaḍim̐ bĕṭṭe vayasu aḍiyāla mānune
bĕṁgadanāna nuṁḍinām̐ bĕḍarem̐sum̐ gāga

(||aṁga||)
vāsigi nĕṁtaliginā valabela takkuvaunu
āsaladom̐ jigiriṁchi alarum̐gāga
yīsuna nĕṁtadiṭṭinā iṁpulela kŏṁchamaunu
vesaranibulagalai viṭravīm̐gum̐gāga

(||aṁga||)
āgaḍimomĕm̐tainā āyamela vūraguṁḍu
dīgŏni tamagamai timurum̐gāga
segŏni māḍāḍaguṁṭe sittamela marabiṁchu
kāgusesi lolonĕ karam̐giṁchum̐gāga

(||aṁga||)
seyi sām̐saguṁṭenu sĕlavi navvela vuṁḍu
toyarānisarasamai tŏḍarum̐gāga
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
veyiḍigi nīradulu viṁtasesum̐gāga