Amgadim badenu vaadu ladivagu neegum bodu

అంగడిఁ బడెను వాదు లతివకు నీకుఁ బోదు
Language

(॥పల్లవి॥)
అంగడిఁ బడెను వాదు లతివకు నీకుఁ బోదు
జంగిలి సటలు మాతోఁ జాలు రారాదా

(॥ఆంగ॥)
వెన్నెల సెలవిఁ గారీ వేడుకలు దైవారీ
యెన్నేవు చెలియకోప మిందులో నేది
కన్నులనే కప్పురాలు కరముల నుప్పరాలు
వన్నెకెక్కీఁ జెలియందు వడఁబడనేఁటికి

(॥ఆంగ॥)
మేనిపైఁ గమ్మనితివి మీం తేనెలు మోవి
యీ నెలఁత నీ మీఁద నీరసమేది
మోనముతోడి గుట్టు ముదితకు వట్టిరట్టు
కానఁబడి వుండఁగానుఁ గడమేలెంచేవు

(॥ఆంగ॥)
మాటలోని వెరగు మరునియింటిపొరుగు
చాటువ నింతికి నబ్బె చల మిందేది
పాటించి శ్రీవేంకటేశ పైపైఁ గూడితివింక
యేఁటికి వట్టి సుద్దులు యియ్యకోలు మాకు

(||pallavi||)
aṁgaḍim̐ baḍĕnu vādu ladivagu nīgum̐ bodu
jaṁgili saḍalu mādom̐ jālu rārādā

(||āṁga||)
vĕnnĕla sĕlavim̐ gārī veḍugalu daivārī
yĕnnevu sĕliyagoba miṁdulo nedi
kannulane kappurālu karamula nupparālu
vannĕgĕkkīm̐ jĕliyaṁdu vaḍam̐baḍanem̐ṭigi

(||āṁga||)
menibaim̐ gammanidivi mīṁ tenĕlu movi
yī nĕlam̐ta nī mīm̐da nīrasamedi
monamudoḍi guṭṭu mudidagu vaṭṭiraṭṭu
kānam̐baḍi vuṁḍam̐gānum̐ gaḍamelĕṁchevu

(||āṁga||)
māḍaloni vĕragu maruniyiṁṭibŏrugu
sāḍuva niṁtigi nabbĕ sala miṁdedi
pāḍiṁchi śhrīveṁkaḍeśha paibaim̐ gūḍidiviṁka
yem̐ṭigi vaṭṭi suddulu yiyyagolu māgu