అంగడి వేసేవు వల పదేరా వోరీ
(॥పల్లవి॥)
అంగడి వేసేవు వల పదేరా వోరీ
వుంగిటి పెద్దతనాన నుండ వేఁటికయ్యా
(॥అంగ॥)
ఇట్టె మరచినమాట లెచ్చరించే విది యేరా
గుట్టునఁ దలఁచుకొంటే కోప మయ్యీని
యెట్టి కేలకు నీపొందు ఇతవుగఁ జేకొంటే
మట్టు మీరి నీవోజలు మాన వేఁటికయ్యా
(॥అంగ॥)
ఆరితేరినపనులు అణఁగ నియ్య వదేర
సారెఁ గొనఁ బెట్టఁ బోతే చల మిక్కీని
తెరుచుక నీసుద్దులు తిద్దుకొని రాఁగాను
పూరకుండి మంచితన మొల్ల వేఁటిక
(॥అంగ॥)
ఇచ్చినకాఁగిటిలోన నీడు వెట్టే విది యేర
కుచ్చి కుచ్చి యెత్తఁబోతే గుబ్బతిల్లీని
విచ్చనవిడి నన్ను శ్రీ వేంకటేశ కూడితివి
నచ్చుల నిఁక సెలవి నవ్వు లేఁటికయ్యా
(||pallavi||)
aṁgaḍi vesevu vala paderā vorī
vuṁgiḍi pĕddadanāna nuṁḍa vem̐ṭigayyā
(||aṁga||)
iṭṭĕ marasinamāḍa lĕchchariṁche vidi yerā
guṭṭunam̐ dalam̐sugŏṁṭe koba mayyīni
yĕṭṭi kelagu nībŏṁdu idavugam̐ jegŏṁṭe
maṭṭu mīri nīvojalu māna vem̐ṭigayyā
(||aṁga||)
āriderinabanulu aṇam̐ga niyya vadera
sārĕm̐ gŏnam̐ bĕṭṭam̐ bode sala mikkīni
tĕrusuga nīsuddulu tiddugŏni rām̐gānu
pūraguṁḍi maṁchidana mŏlla vem̐ṭiga
(||aṁga||)
ichchinagām̐giḍilona nīḍu vĕṭṭe vidi yera
kuchchi kuchchi yĕttam̐bode gubbadillīni
vichchanaviḍi nannu śhrī veṁkaḍeśha kūḍidivi
nachchula nim̐ka sĕlavi navvu lem̐ṭigayyā