(॥పల్లవి॥)
అంగడి నెవ్వరు నంటకురో యీ -
దొంగలఁ గూడిన ద్రోహులను
(॥అంగ॥)
దోసము దోసము తొలరో శ్రీహరి -
దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెఱఁగక చెడి
వీసర పోయిన వెఱ్ఱులను
(॥అంగ॥)
పాపము పాపము పాయరో కర్మపుఁ-
దాపపువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరికథలు
యేపొద్దు వినని హీనులము
(॥అంగ॥)
పంకము పంకము పైకొనిరాకురో
కొంకుఁగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ
లంకెల వినని యన్యులము
(||pallavi||)
aṁgaḍi nĕvvaru naṁṭaguro yī -
dŏṁgalam̐ gūḍina drohulanu
(||aṁga||)
dosamu dosamu tŏlaro śhrīhari -
dāsānadāsula daggaraga
āsalanāsala harinĕṟam̐gaga sĕḍi
vīsara poyina vĕṭrulanu
(||aṁga||)
pābamu pābamu pāyaro karmabum̐-
dābabuvāramu daggaraga
sebaṭṭi vedabu śhrīharigathalu
yebŏddu vinani hīnulamu
(||aṁga||)
paṁkamu paṁkamu paigŏnirāguro
kŏṁkum̐gŏsarulagūḽalamu
veṁkaḍagiribai vibhunibuṇyagatha
laṁkĕla vinani yanyulamu