Amgadi maa valabu neeganuvaayanu

అంగడి మా వలపు నీకనువాయను
Language

(॥పల్లవి॥)
అంగడి మా వలపు నీకనువాయను
వుంగరము వెట్టవయ్య వొక్కమనసాయను

(॥॥)
తమకించి నీవు ముందే తగవులు చెప్పఁగాను
అమర సాకిరెవ్వరి నడిగేము
రమణుల మిద్దరము రతికి లోనైతిమి
జమళిఁ బెండ్లాడవయ్య చలము లీడేరెను

(॥॥)
పొదగి నీవే మాకు బుద్దులు నేరుపఁ గాను
కదిసి మాకిఁక నేల కాఁతాళాలు
సదరాన నీకు నేము చనవరుల మైతిమి
ఇదె సేసవెట్టవయ్య యెంచినటు లాయను

(॥॥)
శ్రీ వేంకటేశ నీవు చేరి మమ్ముఁ గూడఁగాను
చేవదేరె నెవ్వరేమి చెప్పే రింక
భూవనిత యాకె నెప్పుడూ నలమేల్మంగను
నీవే కాఁగలించవయ్య నిండెను వేడుకలు

(||pallavi||)
aṁgaḍi mā valabu nīganuvāyanu
vuṁgaramu vĕṭṭavayya vŏkkamanasāyanu

(||||)
tamagiṁchi nīvu muṁde tagavulu sĕppam̐gānu
amara sāgirĕvvari naḍigemu
ramaṇula middaramu radigi lonaidimi
jamaḽim̐ bĕṁḍlāḍavayya salamu līḍerĕnu

(||||)
pŏdagi nīve māgu buddulu nerubam̐ gānu
kadisi māgim̐ka nela kām̐tāḽālu
sadarāna nīgu nemu sanavarula maidimi
idĕ sesavĕṭṭavayya yĕṁchinaḍu lāyanu

(||||)
śhrī veṁkaḍeśha nīvu seri mammum̐ gūḍam̐gānu
sevaderĕ nĕvvaremi sĕppe riṁka
bhūvanida yāgĕ nĕppuḍū nalamelmaṁganu
nīve kām̐galiṁchavayya niṁḍĕnu veḍugalu