Amduvamka nemi gaddo adiyum joosenamtaa

అందువంక నేమి గద్దో అదియుఁ జూచేనంటా
Language

(॥పల్లవి॥)
అందువంక నేమి గద్దో అదియుఁ జూచేనంటా
సందడి నడియాసలఁ జాలాఁ బొరలేవు

(॥అందు॥)
సరసములాడేయీపె సంగడినె వుండఁగాను
పొరుగాపెతో నేల పొందు సేసేవు
సరవితో నీవొళ్లిజాణతన మెట్టిదో
నిరతి వెన్న వట్టుక నేయి వెదకేవు

(॥అందు॥)
కానుకిచ్చేయాపెచేతి కమ్మపూవుబంతి దీసి
పూని కొలువు సేసేయీపెఁ బోంచి వేసేవు
నీనటనయైనట్టినేరు పెటువంటిదో
చే నద్దము వట్టి వీటఁ జేరి నీడఁ జూచేవు

(॥అందు॥)
నీవురముమీఁదనే నెలఁత వుండఁగాను
కావరించి వేరొకతెఁ గాఁగిలించేవు
శ్రీవేంకటేశ నీచేఁత లెటువంటివో
కైవశమై యేరుండఁగాఁ గాలువఁ బొగడేవు

(||pallavi||)
aṁduvaṁka nemi gaddo adiyum̐ jūsenaṁṭā
saṁdaḍi naḍiyāsalam̐ jālām̐ bŏralevu

(||aṁdu||)
sarasamulāḍeyībĕ saṁgaḍinĕ vuṁḍam̐gānu
pŏrugābĕdo nela pŏṁdu sesevu
saravido nīvŏḽlijāṇadana mĕṭṭido
niradi vĕnna vaṭṭuga neyi vĕdagevu

(||aṁdu||)
kānugichcheyābĕsedi kammabūvubaṁti dīsi
pūni kŏluvu seseyībĕm̐ boṁchi vesevu
nīnaḍanayainaṭṭineru pĕḍuvaṁṭido
se naddamu vaṭṭi vīḍam̐ jeri nīḍam̐ jūsevu

(||aṁdu||)
nīvuramumīm̐dane nĕlam̐ta vuṁḍam̐gānu
kāvariṁchi verŏgadĕm̐ gām̐giliṁchevu
śhrīveṁkaḍeśha nīsem̐ta lĕḍuvaṁṭivo
kaivaśhamai yeruṁḍam̐gām̐ gāluvam̐ bŏgaḍevu