Amduvallam gaani nammamdaadamdu

అందువల్లఁ గాని నమ్మఁడాతఁడు
Language

(॥పల్లవి॥)
అందువల్లఁ గాని నమ్మఁడాతఁడు
అందములుగా నింకా నానవెట్టుకొనవే

(॥॥)
సారె నీవు నగఁగాను సరసుఁడు తనవోళ్ళి
నేరమేదో యని మతి నెమకీని
గారవించి నీవిందుకు కప్పురవీడె మిచ్చి
ఆ రీతి నే మీరనని ఆనవెట్టుకొనవే

(॥॥)
పలుమారు మొక్కఁగాను పచ్చిదేరె వెంగెమని
తలవంచుక బాసలు తలపెట్టీని
కలసి నీవీవేళ కాఁగిలించి బుజ్జగించి
అలరించి నిజముగా నానవెట్టుకొనవే

(॥॥)
వొద్దఁ గాచుకుండఁగాను వొరసీ నిదోమో యని
పొద్దు వొద్దు నీతోనే భోగించీని
వొద్దిక శ్రీవేంకటేశు నొడఁబరచి నీవిట్టే
అద్దుకొని పాదములు నానవెట్టుకొనవే

(||pallavi||)
aṁduvallam̐ gāni nammam̐ḍādam̐ḍu
aṁdamulugā niṁkā nānavĕṭṭugŏnave

(||||)
sārĕ nīvu nagam̐gānu sarasum̐ḍu tanavoḽḽi
neramedo yani madi nĕmagīni
gāraviṁchi nīviṁdugu kappuravīḍĕ michchi
ā rīdi ne mīranani ānavĕṭṭugŏnave

(||||)
palumāru mŏkkam̐gānu pachchiderĕ vĕṁgĕmani
talavaṁchuga bāsalu talabĕṭṭīni
kalasi nīvīveḽa kām̐giliṁchi bujjagiṁchi
alariṁchi nijamugā nānavĕṭṭugŏnave

(||||)
vŏddam̐ gāsuguṁḍam̐gānu vŏrasī nidomo yani
pŏddu vŏddu nīdone bhogiṁchīni
vŏddiga śhrīveṁkaḍeśhu nŏḍam̐barasi nīviṭṭe
addugŏni pādamulu nānavĕṭṭugŏnave