Amduvallam gaanavachchee nannivedugalu neegu

అందువల్లఁ గానవచ్చీ నన్నివేడుకలు నీకు
Language

(॥పల్లవి॥)
అందువల్లఁ గానవచ్చీ నన్నివేడుకలు నీకు
సందుసుడి మోహమెల్లా చవిగొనరాదా

(॥అందు॥)
సవతుల నిద్దరిని సరిఁ బెనఁగు మనేవు
యివల నీ కందువంక నేమివచ్చెను
జవళి నొకరొకరిసత్వ చూడవలసితే
తివిరి నీ కాఁగిట సోదించి చూడరాదా

(॥అందు॥)
పొలఁతుల మిద్దరిని పూఁచి పందేలాడించేవు
యెలమి నీ కందువంక నీమి వచ్చెను
నెలకొని వారివారి నేర్పు చూడవలసితే
కలదెల్లా యేకతానఁ గనుఁగొనరాదా

(॥అందు॥)
ఇంతుల నిద్దరి నొరయించేవు శ్రీవేంకటేశ
ఇంతసేయఁగా నీకు నేమి వచ్చెను
పంతాన నన్నేలితివి బత్తి వారిపయిఁ గలితే
అంతలోనే నీవు పెండ్లాడి చూడరాదా

(||pallavi||)
aṁduvallam̐ gānavachchī nanniveḍugalu nīgu
saṁdusuḍi mohamĕllā savigŏnarādā

(||aṁdu||)
savadula niddarini sarim̐ bĕnam̐gu manevu
yivala nī kaṁduvaṁka nemivachchĕnu
javaḽi nŏgarŏgarisatva sūḍavalaside
tiviri nī kām̐giḍa sodiṁchi sūḍarādā

(||aṁdu||)
pŏlam̐tula middarini pūm̐si paṁdelāḍiṁchevu
yĕlami nī kaṁduvaṁka nīmi vachchĕnu
nĕlagŏni vārivāri nerbu sūḍavalaside
kaladĕllā yegadānam̐ ganum̐gŏnarādā

(||aṁdu||)
iṁtula niddari nŏrayiṁchevu śhrīveṁkaḍeśha
iṁtaseyam̐gā nīgu nemi vachchĕnu
paṁtāna nannelidivi batti vāribayim̐ galide
aṁtalone nīvu pĕṁḍlāḍi sūḍarādā