Amdunane kanumgone nadani batti

అందుననే కనుఁగొనే నతని బత్తి
Language

(॥పల్లవి॥)
అందుననే కనుఁగొనే నతని బత్తి
ఇందువదనరో నాకు నెరిఁగించఁగదవే

(॥అందు॥)
చెప్పిన నావిన్నపము చేకొని వినె నటవే
కప్పురమందె నటవే కానికగాను
ముప్పిరి నందుకుఁగాను మోము చెంగలించె నటే
చిప్పిలి కరఁగి యట్టే చెమరించెనటవే

(॥అందు॥)
వాలాయించి మా ఇంటికివచ్చే ననె నటవే
యేలేనని నిండుబాస లిచ్చె నటవే
మేలువాఁడై కొంత గొంత మేలమాడెనటవే
కీలెఱిఁగి మనమీఁదఁ గృపసేసె నటవే

(॥అందు॥)
ఇందాఁకా శ్రీవేంకటేశుఁ డెదుట నుండె నటవే
అందగాఁడై నాకు సతమాయ నటవే
ఇందరిలో కాఁగిట నన్నేకతానఁ గూడెనటే
చందమాయఁ బనులెల్లా సరివచ్చె నటవే

(||pallavi||)
aṁdunane kanum̐gŏne nadani batti
iṁduvadanaro nāgu nĕrim̐giṁcham̐gadave

(||aṁdu||)
sĕppina nāvinnabamu segŏni vinĕ naḍave
kappuramaṁdĕ naḍave kānigagānu
muppiri naṁdugum̐gānu momu sĕṁgaliṁchĕ naḍe
sippili karam̐gi yaṭṭe sĕmariṁchĕnaḍave

(||aṁdu||)
vālāyiṁchi mā iṁṭigivachche nanĕ naḍave
yelenani niṁḍubāsa lichchĕ naḍave
meluvām̐ḍai kŏṁta gŏṁta melamāḍĕnaḍave
kīlĕṟim̐gi manamīm̐dam̐ gṛpasesĕ naḍave

(||aṁdu||)
iṁdām̐kā śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa nuṁḍĕ naḍave
aṁdagām̐ḍai nāgu sadamāya naḍave
iṁdarilo kām̐giḍa nannegadānam̐ gūḍĕnaḍe
saṁdamāyam̐ banulĕllā sarivachchĕ naḍave